ముగ్గురు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య
ఆర్ధిక ఇబ్బందులు తాళలేక ఓ తండ్రి తన ముగ్గురి పిల్లలను చంపి తాను ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం టంగుటూరులో చోటుచేసుకుంది

విధాత : ఆర్ధిక ఇబ్బందులు తాళలేక ఓ తండ్రి తన ముగ్గురి పిల్లలను చంపి తాను ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం టంగుటూరులో చోటుచేసుకుంది. తన ముగ్గురు కుమారులు సాయికిరణ్ (13) మోహిత్ కుమార్ (10) ఉదయ్ కిరణ్ (7) ను హతమార్చిన తండ్రి రవి(35) చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా తండ్రి రవి పిల్లలను చంపినట్లు తెలుస్తోంది. మోకిలా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మనీ స్కీమ్‌లో వెయ్యికి రూ. 3వేల ఇప్పిస్తానని రవి పలువురి వద్ద డబ్బు సేకరించినట్లు సమాచారం. అయితే తన వద్ద డబ్బు తీసుకున్న వ్యక్తి తిరిగి ఇవ్వకపోవడంతో రవి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.