Rasi Phalalu: ఫిబ్రవరి16, ఆదివారం.. నేటి మీరాశి ఫలాలు! వారు శుభవార్తలు వింటారు

Rasi Phalalu, Horoscope | జ్యోతిషం, రాశి ఫలాలు అంటే మన తెలుగు వారికి ఏండ్ల తరబడి నుంచి చెరగని నమ్మకం. లేచిన సమయం నుంచి నిద్రించే వరకు మంచే జరగాలని కోరుకుంటూ ఉంటాం. అందుకే ఆ రోజు మన రాశి ఫలాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మన పనులు నిర్వహిస్తూ ఉంటాం. దాని ప్రకారమే నడుచుకుంటూ ఉంటాం కూడా. అందుకే నిద్ర లేవగానే మొదట చాలామంది వెలికేది వారికి ఆరోజు ఎలా ఉండబోతుందనే. అలాంటి వారందరి కోసం వారి పేర్ల పేర రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
మేషం (Aries) :
ఆకస్మిక ధన లాభం. కుటుంబంలో ఆనందోత్సాహాలు లభిస్తాయి. బంధు, మిత్రులతో కలుస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. దూరప్రాంతాల నుంచి వార్తలు.
వృషభం (Taurus) :
తోటివారితో సౌఖ్యంగా ఉండాలి. వ్యాపారంలో నష్టం వచ్చే అవకాశాలు. వృధా ప్రయాణాలు అధికం. కుటుంబ విషయాల్లో అనాసక్తి. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం. తీర్థయాత్రలు చేస్తారు. కుటుంబ సమస్యల నుంచి బయట పడుతారు. ఉద్యోగ బకాయిలు వస్తాయి
మిథునం (Gemini) :
రుణప్రయత్నాలు సఫలం. కుటుంబ పరిస్థితుల వళ్ల మానసిక ఆందోళన. స్త్రీలకు అనారోగ్య సమస్యలు వస్తాయి. బంధు, మిత్రులతో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారులకు లాభాలు వస్తాయి. సరికొత్త విషయాలు తెలియ వస్తాయి. ఉద్యోగంలో ఉన్నత స్థానాలు పొందుతారు.
కర్కాటకం (Cancer) :
సంతృప్తికరంగా కుటుంబ పరిస్థితులు. ఆకస్మిక ధననష్టం. అనవసర ప్రయాణాలు అధికం. బంధువులు, మిత్రులతో కలహాలకు దూరంగా ఉండాలి. వృత్తి, ఉద్యోగా రంగాల్లో ఓపిక వహించాలి. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ధీర్ఘకాలంగా ఉన్న అనారోగ్య సమస్యలు తీరుతాయి.
సింహం (Leo) :
కొత్త వ్యక్తులను నమ్మి మోసపోయే అవకాశం. సంఘంలో అప్రతిష్ఠ రాకుండా వ్యవహరించాలి. చేసే ప్రయత్నాలలో ఆటంకాలతో ఇబ్బందులు. దైవదర్శనానికి ప్రయత్నిస్తారు. ఆలస్యంగా రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరుల మధ్య వైరాలు వచ్చే అవకాశం. చకచకా పనులు పూర్తి చేసుకుంటారు. అప్పులు ఇచ్చిన వారి ఒత్తిడులు తగ్గుతాయి.
కన్య (Virgo) :
స్థిరాస్తుల విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం, వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. కాలం నిరుత్సాహంగా, స్లోగా గడుస్తుంది. అపకీర్తి పొందే అవకాశం. చేసే పనులతో ఇతరులకు ఇబ్బందులు వచ్చే అవకాశం. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు ఉంటాయి. దగ్గరి అప్తుల నుంచి శుభకార్యాల ఆహ్వానాలు అందుకుంటారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు.
తుల (Libra) :
ప్రయత్నం మేరకు స్వల్ప లాభం ఉంటుంది. వృథా ప్రయాణాలు అధికం. వ్యాపారాల్లో లాభాలు. రుణ ప్రయత్నాలు ఎక్కువ చేస్తారు. నూతన పనులను ఆరంభిస్తారు. బంధు, మిత్రుల సహకారం ఆలస్యం. ఆలయాలు సందర్శిస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వ్యాపారం విస్తరణ యత్నాలు చేస్తారు.
వృశ్చికం (Scorpio) :
వృత్తిరీత్యా అనుకూల స్థానచలనం. ఆర్థిక ఇబ్బందులతో సతమతం తప్పదు. కొట్లాటలకు దూరంగా ఉండాలి . తొందరపాటు వళ్ల స్థిరాస్తుల విషయాల్లో సమస్యలు. శుభకార్యాల్లో పాల్గొంటారు. నూతన ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. కుంభమేళా యాత్రా ప్రయత్నాలు సఫలం. వ్యాపారాల్లో లాభాలు
ధనుస్సు (Sagittarius) :
కుటుంబమంతా సుఖః సంతోషాలు. వాయిదా పనులన్నీ పూర్తి. వాహనాలు కొనుగోలు, స్థిరనివాసం ఉంటుంది. వ్యవసాయ మూలకంగా లాభాలు. ప్రయత్న కార్యాలు సఫలం. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు.
మకరం (Capricorn) :
అనుకొని పనులు జరుగుతాయి. స్వల్ప అనారోగ్య బాధలు. సమయానికి భోజనం, పనులు చేయడానికి ప్రాధాన్యత. స్థిరత్వం లేక ఇబ్బందులు. పిల్లలపై శ్రద్ధ వహించాలి. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఆశించిన లాభాలు, కోరుకున్న బదిలీలు ఉంటాయి.
కుంభం (Aquarius) :
సంతృప్తికరంగా కుటుంబ పరిస్థితులు. చేసే పనుల విషయంలో ఓపిక వహించాలి. బంధు, మిత్రులతో విరోధం అవకాశాలు. అనవసర ధన వ్యయం. రుణ ప్రయత్నాలు రెట్టింపు. రావలసిన డబ్బులు అందక ఇబ్బంది పడతారు. పనిభారం పెరుగుతుంది. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. తీర్ధయాత్రలు చేస్తారు.
మీనం (Pisces) :
ఆర్థిక ఇబ్బందులు తప్పవు. రుణప్రయత్నాలు అధికం. ఆలస్యంగా బంధు, మిత్రుల సహకారం. కుటుంబంలో గొడవలు వచ్చే అవకాశం. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. అరుదైన వ్యక్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాల నుంచి విముక్తి. కొద్దిపాటి అనారోగ్య సూచనలు. వ్యాపారాలు పుంజుకుంటాయి.