VIRAL: థాయి ఎయిర్‌వేస్‌లో.. కొట్టుకున్న ప్రయాణికులు

బ్యాంకాక్ నుంచి కోల్‌క‌తాకు వెళ్తున్న విమానంలో ఘ‌ట‌న‌ విధాత‌: మ‌నిషి సామాజిక‌, ఆర్థిక స్థితిని బ‌ట్టి ప్ర‌వ‌ర్త‌న మారుతుంది అంటారు. కానీ ఇది చాలా సంద‌ర్భాల్లో నిజం కాదేమోన‌నే అనుమానాలు రేకెత్తేలా కొంద‌రు ప్ర‌వ‌ర్తిస్తుంటారు. ఈ స్థాయిలో.. కూడా ఇదేం ఖ‌ర్మ‌రా బాబూ అన్నతీరుగా కొంద‌రు వ్య‌వ‌హ‌రిస్తారు. చూసే వారే సిగ్గుతో త‌ల‌దించుకొనేలా న‌డుచుకుంటారు. స‌రిగ్గా ఇలాంటి ఘ‌ట‌నే థాయి ఎయిర్‌వేస్ విమానంలో జ‌రిగింది. బ్యాంకాక్ నుంచి కోల్‌క‌తాకు బ‌య‌లు దేరాల్సిన విమానం టేకాఫ్ కావ‌టానికి సిద్ధంగా […]

VIRAL: థాయి ఎయిర్‌వేస్‌లో.. కొట్టుకున్న ప్రయాణికులు
  • బ్యాంకాక్ నుంచి కోల్‌క‌తాకు వెళ్తున్న విమానంలో ఘ‌ట‌న‌

విధాత‌: మ‌నిషి సామాజిక‌, ఆర్థిక స్థితిని బ‌ట్టి ప్ర‌వ‌ర్త‌న మారుతుంది అంటారు. కానీ ఇది చాలా సంద‌ర్భాల్లో నిజం కాదేమోన‌నే అనుమానాలు రేకెత్తేలా కొంద‌రు ప్ర‌వ‌ర్తిస్తుంటారు. ఈ స్థాయిలో.. కూడా ఇదేం ఖ‌ర్మ‌రా బాబూ అన్నతీరుగా కొంద‌రు వ్య‌వ‌హ‌రిస్తారు. చూసే వారే సిగ్గుతో త‌ల‌దించుకొనేలా న‌డుచుకుంటారు. స‌రిగ్గా ఇలాంటి ఘ‌ట‌నే థాయి ఎయిర్‌వేస్ విమానంలో జ‌రిగింది.

బ్యాంకాక్ నుంచి కోల్‌క‌తాకు బ‌య‌లు దేరాల్సిన విమానం టేకాఫ్ కావ‌టానికి సిద్ధంగా ఉన్న‌ది. టేకాఫ్ అయ్యే ముందు అంద‌రూ తాము కూర్చొన్న సీట్ల‌ను నిటారుగా స‌రిచేసుకొని కూర్చోవాల‌ని విమాన సిబ్బంది ప్ర‌యాణికుల‌కు సూచించారు. అయినా ఓ ప్ర‌యాణికుడు త‌న‌కు న‌డుము నొప్పి ఉన్న‌ద‌ని అలాగే కూర్చుండి పోయాడు.

దాంతో సిబ్బంది అత‌న్ని నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా స‌రిచేసుకోవాల‌ని కోరినా ప‌ట్టించుకోక పోవ‌టంతో తోటి ప్ర‌యాణికుడు అతనికి న‌చ్చ‌చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. ఆ క్ర‌మంలో వారి మ‌ధ్య వాదులాట నుంచి తోపులాట దాకా పోయింది. జ‌రిగిన ఘ‌ట‌న‌తో సాటి ప్ర‌యాణికులు కూడా జోక్యం చేసుకొని నిర్ల‌క్ష్యం వ‌హించిన ప్ర‌యాణికుడిపై పిడిగుద్దులతో బుద్ధి చెప్పే ప‌రిస్థితి ఏర్ప‌డింది.

విమానంలో జ‌రిగిన ఈ ఘ‌ట‌నను అంతా తోటి ప్ర‌యాణికుడొక‌రు వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్టు చేశాడు. వీడియో చూసిన వారంతా.. మ‌నిషి ఎన్న‌డు మారేనురా అంటూ.. నిట్టూర్పులు విడుస్తున్న ప‌రిస్థితి వ‌చ్చింది. విమానంలో జ‌రిగిన ఘ‌ట‌న‌ను థాయి స్మైల్ ఎయిర్‌వేస్ ఉన్న‌తాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఘ‌ట‌న పూర్వ ప‌రాల గురించి అధికారులు పూర్తిస్థాయిలో విచార‌ణ జ‌రిపి త‌గు చ‌ర్య‌లు తీసుకోవ‌టానికి స‌మాయ‌త్తం అవుతున్నారు.