Actress Jayaprada | సినీ న‌టి జ‌య‌ప్ర‌ద‌కు ఆరు నెల‌ల జైలుశిక్ష‌

Actress Jayaprada | చెన్నై: ప్ర‌ఖ్యాత సినీ న‌టి, మాజీ ఎంపీ జ‌య‌ప్ర‌ద‌(Jayaprada)కు ఆరు నెల‌ల జైలు శిక్ష ప‌డింది. చెన్నైలోని ఎగ్మోర్ కోర్టు ఈ శిక్ష‌ను ఖ‌రారు చేసింది. ఆమెకు 5వేల జ‌రిమానా కూడా విధించారు. రాయ‌పేట‌లో ఉన్న‌ జ‌య‌ప్ర‌ద‌కు చెందిన సినీ థియేట‌ర్ ఉద్యోగులు వేసిన పిటీష‌న్‌పై కోర్టు ఈ తీర్పును వెలువ‌రించింది. చెన్నైకి చెందిన రామ్ కుమార్‌, రాజా బాబూ అనే వ్య‌క్తులు ఆ థియేట‌ర్‌ను న‌డిపిస్తున్నారు. ఆ థియేట‌ర్‌కు చెందిన యాజ‌మాన్యం.. […]

  • By: krs    latest    Aug 11, 2023 11:42 AM IST
Actress Jayaprada | సినీ న‌టి జ‌య‌ప్ర‌ద‌కు ఆరు నెల‌ల జైలుశిక్ష‌

Actress Jayaprada |

చెన్నై: ప్ర‌ఖ్యాత సినీ న‌టి, మాజీ ఎంపీ జ‌య‌ప్ర‌ద‌(Jayaprada)కు ఆరు నెల‌ల జైలు శిక్ష ప‌డింది. చెన్నైలోని ఎగ్మోర్ కోర్టు ఈ శిక్ష‌ను ఖ‌రారు చేసింది. ఆమెకు 5వేల జ‌రిమానా కూడా విధించారు. రాయ‌పేట‌లో ఉన్న‌ జ‌య‌ప్ర‌ద‌కు చెందిన సినీ థియేట‌ర్ ఉద్యోగులు వేసిన పిటీష‌న్‌పై కోర్టు ఈ తీర్పును వెలువ‌రించింది.

చెన్నైకి చెందిన రామ్ కుమార్‌, రాజా బాబూ అనే వ్య‌క్తులు ఆ థియేట‌ర్‌ను న‌డిపిస్తున్నారు. ఆ థియేట‌ర్‌కు చెందిన యాజ‌మాన్యం.. ఉద్యోగుల‌కు ఈఎస్ఐ ఇవ్వ‌లేదు. దాని వ‌ల్లే ఆ ఉద్యోగులు కోర్టును ఆశ్ర‌యించారు. థియేట‌ర్ ఉద్యోగుల‌కు మొత్తం అమౌంట్‌ను చెల్లించేందుకు జ‌య‌ప్ర‌ద అంగీక‌రించింది.

కేసును కొట్టివేయాల‌ని ఆమె కోర్టును కోరింది. కానీ జ‌య‌ప్ర‌ద అభ్య‌ర్థ‌న‌ను లేబ‌ర్ బీమా సంస్థ వ్య‌తిరేకించిం ది. దీంతో ఆ కేసులో జ‌య‌ప్ర‌ద‌తో పాటు మ‌రో ముగ్గురికి ఆరు నెల‌ల జైలు శిక్ష విధించారు. ఆ ముగ్గురికి కూడా 5వేల జ‌రిమానా విధించారు.