మొత్తానికి యాంకర్ ప్రదీప్‌‌ పెళ్లవుతోంది.. వధువు ఎవరంటే?

విధాత‌: యాంకర్ ప్రదీప్ మాచినేని గురించి తెలియని వారు ఉండరు. 36 ఏళ్ల ఈ బుల్లితెర స్టార్.. చాలా కాలం నుండి పెళ్లి వార్తలు వస్తుంటే వాటిని కొట్టిపారేస్తూ వచ్చాడు. ఈయనపై కొన్ని లైంగిక ఆరోపణలు కూడా వచ్చాయి. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కూడా నమోదు అయ్యాయి. స్వయంవరం అనే షోలో ఆయన కోసం ఎగబడిన అమ్మాయిలు ఎంద‌రో ఉన్నారు. యాంకరింగ్ అంటేనే అమ్మాయిలది డామినేషన్. దాన్నిబద్దలు కొట్టిన వ్యక్తిగా ట్రెండ్ సెట్టర్‌గా ప్రదీప్‌ని […]

మొత్తానికి యాంకర్ ప్రదీప్‌‌ పెళ్లవుతోంది.. వధువు ఎవరంటే?

విధాత‌: యాంకర్ ప్రదీప్ మాచినేని గురించి తెలియని వారు ఉండరు. 36 ఏళ్ల ఈ బుల్లితెర స్టార్.. చాలా కాలం నుండి పెళ్లి వార్తలు వస్తుంటే వాటిని కొట్టిపారేస్తూ వచ్చాడు. ఈయనపై కొన్ని లైంగిక ఆరోపణలు కూడా వచ్చాయి. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కూడా నమోదు అయ్యాయి.

స్వయంవరం అనే షోలో ఆయన కోసం ఎగబడిన అమ్మాయిలు ఎంద‌రో ఉన్నారు. యాంకరింగ్ అంటేనే అమ్మాయిలది డామినేషన్. దాన్నిబద్దలు కొట్టిన వ్యక్తిగా ట్రెండ్ సెట్టర్‌గా ప్రదీప్‌ని చెప్పుకోవచ్చు. సుడిగాలి సుధీర్ రానంత వరకు ప్రదీప్‌కి అడ్డే లేదు. ఈ ఫేమ్‌ తోనే ఆయన హీరో కూడా అయ్యాడు. ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అనే మూవీ ద్వారా ఆయన హీరోగా పరిచయం అయ్యాడు.

అంతకుముందే త్రివిక్రమ్‌తో ఉన్న సాన్నిహిత్యం వల్ల ‘జులాయి, అత్తారింటికి దారేది’ వంటి చిత్రాలలో చిన్న చిన్న పాత్రలు చేశాడు. ఎంతమంది వచ్చినా ఇప్పటికీ యాంకర్‌గా ప్రదీప్ కి డోకా లేదు. దానికి తోడు కొత్తగా ఓటీటీ షోలు రావడంతో మరింత బిజీగా మారాడు. తాజాగా ప్రదీప్ తన వివాహానికి ఓకే చెప్పినట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలిలా ఉన్నాయి.

యాంకర్ ప్రదీప్ ప్రేమ వివాహం చేసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్‌ని ఆయన చాలా కాలంగా ప్రేమిస్తున్నాడట. ఆమెతోనే ఏడు అడుగులు న‌డ‌వ‌నున్నాడు. ఇరు కుటుంబాల పెద్దలు మాట్లాడుకోవడం కూడా జరిగిందట. వీరి మతాలు వేరైనప్పటికీ ఇరు కుటుంబాల మధ్య ఎప్పటినుండో స్నేహం ఉన్న నేపథ్యంలో పెళ్లి సంబంధం కుదిరింది అని తెలుస్తోంది.

త్వరలో ప్రదీప్ వివాహం పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. గతంలో కూడా ఆయన నేను లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటాను. ప్రేమించినప్పటికీ పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుంటానని చెప్పాడు. మరి ఈసారైనా ప్రదీప్ పెళ్లి వార్తల్లో నిజం ఉందో లేదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగకు తప్పదు.

అయితే వినిపిస్తున్న వార్తల ప్రకారం.. ప్రదీప్ స్నేహితురాలైన ఆయ‌న‌కు కాబోయే శ్రీ‌మ‌తి ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్‌గా టెలివిజన్ రంగంలో బాగానే క్రేజ్ అందుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు ప్రదీప్‌కు సంబంధించిన ప్రతి టెలివిజన్ షోకు ఆమె వర్క్ చేసినట్లు సమాచారం. ఇటీవల ఆమె బిగ్‌బాస్‌కు సంబంధించిన కంటెస్టెంట్స్‌కు కూడా ఫ్యాషన్ డిజైనర్‌గా వర్క్ చేసినట్టు తెలుస్తోంది!