Fire Accident | ఫెర్రీలో భారీ అగ్నిప్రమాదం.. 31 మంది దుర్మరణం
Fire Accident | దక్షిణ ఫిలిప్పీన్స్‌లో ఓ ఫెర్రీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటలకు 31 మంది ఆహుతయ్యారు. మరో 230 మందిని రక్షించినట్లు అధికారులు గురువారం తెలిపారు. లేడీ మేరీ జాయ్-3 మిండినావో ద్వీపంలోని జాంబోంగా సిటీ నుంచి సులు ప్రావిన్స్‌లోని జోలో ద్వీపానికి వెళ్తున్న సమయంలో బుధవారం రాత్రి ఒక్కసారిగా ఫెర్రీలో మంటలు చెలరేగాయి. దాంతో చాలా మంది మంటల బారి నుంచి తప్పించుకునేందుకు నీటిలోకి దూకినట్లు విపత్తు అధికారి నిక్సన్ అలోంజో […]

Fire Accident | దక్షిణ ఫిలిప్పీన్స్‌లో ఓ ఫెర్రీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటలకు 31 మంది ఆహుతయ్యారు. మరో 230 మందిని రక్షించినట్లు అధికారులు గురువారం తెలిపారు. లేడీ మేరీ జాయ్-3 మిండినావో ద్వీపంలోని జాంబోంగా సిటీ నుంచి సులు ప్రావిన్స్‌లోని జోలో ద్వీపానికి వెళ్తున్న సమయంలో బుధవారం రాత్రి ఒక్కసారిగా ఫెర్రీలో మంటలు చెలరేగాయి. దాంతో చాలా మంది మంటల బారి నుంచి తప్పించుకునేందుకు నీటిలోకి దూకినట్లు విపత్తు అధికారి నిక్సన్ అలోంజో తెలిపారు. బాసిలాన్ ప్రావిన్స్‌లోని బలుక్-బలుక్ ద్వీపంలోని ఘటన జరగ్గా.. ఫిలిప్పీన్స్ కోస్ట్‌గార్డ్ 195 మంది ప్రయాణికులతో 35 మంది సిబ్బందిని రక్షించినట్లు పేర్కొన్నారు.
ఎయిర్ కండిషన్డ్ క్యాబిన్‌లో 18 మృతదేహాలు రికవరీ చేశామని, ఘటనలో మొత్తం 31 మంది మృతి చెందినట్లు బాసిలన్ గవర్నర్ జిమ్ సల్లిమాన్ పేర్కొన్నారు. కోస్ట్‌గార్డ్ ఫొటోలు విడుదల చేసింది. మంటలు, దట్టమైన పొగ నౌకను చుట్టుముట్టడంతో చాలామంది ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారని, అగ్నిమాపక సిబ్బంది జైసన్ అహిజోన్, చాలామంది లైఫ్ జాకెట్లు లేకుండానే షిప్ నుంచి కిందకు దూకారని పేర్కొన్నారు. మంటలు ఊహకు అందని విధంగా చాలా వేగంగా వ్యాపించాయని అహిజోన్ తెలిపారు. కోస్ట్ గార్డ్ అధికారులు ఇతర ప్రయాణీకులను సురక్షితంగా ఉంచేందుకు సహకరించారని వివరించారు. మృతుల్లో కనీసం ముగ్గురు చిన్నారులు, ఆరు నెలల పాప సైతం ఉన్నారని సల్లిమాన్ తెలిపారు.