Khammam: BRS ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి.. బాణాసంచా పేలుడులో ఒకరి మృతి.. తెగిపడ్డ కాళ్లు ,చేతులు
ఖమ్మం జిల్లాలోని వైరా నియోజకవర్గం పరిధిలోని చీమలపాడులో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనానికి ఎంపీ నామా నాగేశ్వర్ రావు, స్థానిక ఎమ్మెల్యేతో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు బాణాసంచా కాల్చారు. దీంతో సభా ప్రాంగణానికి 200 మీటర్ల దూరంలో ఉన్న గుడిసెపై నిప్పురవ్వలు ఎగిరిపడ్డాయి. BRS ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి.. బాణాసంచా పేలుడులో ఇద్దరు మృతి.. తెగినడ్డ కాళ్లు ,చేతులు https://t.co/fsgiuSz3f0 pic.twitter.com/XGTxCzByrj — vidhaathanews (@vidhaathanews) […]

ఖమ్మం జిల్లాలోని వైరా నియోజకవర్గం పరిధిలోని చీమలపాడులో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనానికి ఎంపీ నామా నాగేశ్వర్ రావు, స్థానిక ఎమ్మెల్యేతో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు బాణాసంచా కాల్చారు. దీంతో సభా ప్రాంగణానికి 200 మీటర్ల దూరంలో ఉన్న గుడిసెపై నిప్పురవ్వలు ఎగిరిపడ్డాయి.
BRS ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి.. బాణాసంచా పేలుడులో ఇద్దరు మృతి.. తెగినడ్డ కాళ్లు ,చేతులు https://t.co/fsgiuSz3f0 pic.twitter.com/XGTxCzByrj
— vidhaathanews (@vidhaathanews) April 12, 2023
ఈ క్రమంలో గుడిసెకు మంటలు అంటుకున్నాయి. గుడిసెలో ఉన్న సిలిండర్ పేలింది. దీంతో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలిస్తుండగా ఒకరు మృతి చెందారు. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. అయితే క్షతగాత్రులందరికీ కాళ్లు విరిగినట్లు వైద్యులు తెలిపారు.
వీరిలో ఒకరిద్దరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు స్పష్టం చేశారు. మృతుడిని మహారాష్ట్రకు చెందిన వలసకూలీ సందీప్‌గా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రుల్లో పోలీసులు, జర్నలిస్టులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాదం నేపథ్యంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని ఎంపీ నామా నాగేశ్వర్ రావు నిలిపివేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఎంపీ నామా పరామర్శించారు.
గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందిస్తామని నామా స్పష్టం చేశారు. భారీ పేలుడు శబ్దం రావడంతో కార్యకర్తలు పరుగులు పెట్టారని, దీంతో సమావేశం నిలిపివేసినట్లు ఎంపీ నామా నాగేశ్వర్ రావు పేర్కొన్నారు.
చీమలపడు ఘటనలో భాదితుల వివరాలు
1.సందీప్ (ఎడమకాలు పోయింది, మరో కాలు నుజ్జు నుజ్జు అయింది)
2.తేజావత్ భాస్కర్ తడికల పూడి గ్రామం, (ఎడమకాలు పోయింది)
3.బాణోత్ రమేష్ (చనిపోయాడు)స్టేషన్ చీమలపాడు
4.ఆంగోత్ కుమార్ (ఎడమ కాలు పోయింది), వెంకట్యా తండా
5.ధర్మసూత్ లక్ష్మణ్ గేటు కారేపల్లి, (ఎడమ కాలు నుజ్జు నుజ్జు)
6.మంగు. (మరణించాడు)
కారేపల్లి ఘటనపై సీఎం KCR, మంత్రులు KTR, హరీశ్‌రావు తీవ్ర దిగ్బ్రాంతి