Firing | అమెరికాలో కాల్పులు.. తెలుగమ్మాయి ఐశ్వర్య రెడ్డి మృతి

Firing | విధాత: అమెరికాలో జరిగిన కాల్పుల(Firing)మృతుల్లో తెలుగు అమ్మాయి హైదరాబాద్‌ సరూర్‌నగర్‌కు చెందిన తాటికొండ ఐశ్వర్య రెడ్డి (27) మృతి చెందింది. టెక్సాస్‌లోని డల్లాస్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న అలెన్ ప్రీమియర్ షాపింగ్ కాంప్లెక్స్‌లో శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఒక దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ దుర్ఘటనలో 8 మంది అక్కగికక్కడే మృతి చెందగా మృతుల్లో తాటికొండ ఐశ్వర్య కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఐశ్వర్య తండ్రి రంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయమూర్తిగా […]

  • By: krs    latest    May 08, 2023 4:56 AM IST
Firing | అమెరికాలో కాల్పులు.. తెలుగమ్మాయి ఐశ్వర్య రెడ్డి మృతి

Firing |

విధాత: అమెరికాలో జరిగిన కాల్పుల(Firing)మృతుల్లో తెలుగు అమ్మాయి హైదరాబాద్‌ సరూర్‌నగర్‌కు చెందిన తాటికొండ ఐశ్వర్య రెడ్డి (27) మృతి చెందింది. టెక్సాస్‌లోని డల్లాస్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న అలెన్ ప్రీమియర్ షాపింగ్ కాంప్లెక్స్‌లో శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఒక దుండగుడు కాల్పులు జరిపాడు.

ఈ దుర్ఘటనలో 8 మంది అక్కగికక్కడే మృతి చెందగా మృతుల్లో తాటికొండ ఐశ్వర్య కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఐశ్వర్య తండ్రి రంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తుండగా, ఐశ్వర్య పర్‌ ఫెక్ట్‌ జనరల్‌ కాంట్రాక్టర్స్‌ కంపెనీలో ప్రాజెక్ట్‌ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నది. వీరి స్వస్థలం నల్గొండ జిల్లా నేరడుచర్ల.