Himachal Pradesh | హిమాచల్‌ వరదలు.. వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ఒక్క‌టైన జంట‌

Himachal Pradesh విధాత‌: పెళ్లంటే నూరేళ్ల పంట‌.. మ‌రి అలాంటి పెళ్లిని ఘ‌నంగా నిర్వ‌హించుకోవాల‌ని ప్ర‌తీ జంట క‌ల‌లు కంటోంది. ముచ్చ‌ట‌గా మూడు రోజుల పాటు పెళ్లి వేడుక‌ను నిర్వ‌హించుకొని, పంచ‌భూతాల సాక్షిగా ఒక్క‌ట‌వ్వాల‌ని కోరుకుంటారు. కానీ ఈ పెళ్లి మాత్రం వ‌ర్షం సాక్షిగా జ‌రిగింది. నిర్ణ‌యించిన ముహుర్తానికి ఆ జంట‌కు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా వివాహం జ‌రిపించారు. వ‌ర్షం సాక్షిగా ఒక్క‌టైన ఈ జంట త‌మ నూత‌న జీవితానికి నాంది ప‌లికింది. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని సిమ్లా […]

Himachal Pradesh | హిమాచల్‌ వరదలు.. వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ఒక్క‌టైన జంట‌

Himachal Pradesh

విధాత‌: పెళ్లంటే నూరేళ్ల పంట‌.. మ‌రి అలాంటి పెళ్లిని ఘ‌నంగా నిర్వ‌హించుకోవాల‌ని ప్ర‌తీ జంట క‌ల‌లు కంటోంది. ముచ్చ‌ట‌గా మూడు రోజుల పాటు పెళ్లి వేడుక‌ను నిర్వ‌హించుకొని, పంచ‌భూతాల సాక్షిగా ఒక్క‌ట‌వ్వాల‌ని కోరుకుంటారు. కానీ ఈ పెళ్లి మాత్రం వ‌ర్షం సాక్షిగా జ‌రిగింది. నిర్ణ‌యించిన ముహుర్తానికి ఆ జంట‌కు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా వివాహం జ‌రిపించారు. వ‌ర్షం సాక్షిగా ఒక్క‌టైన ఈ జంట త‌మ నూత‌న జీవితానికి నాంది ప‌లికింది.

హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని సిమ్లా జిల్లా కోట్‌ఘ‌ర్ ప్రాంతానికి చెందిన ఆశిష్ సింఘాకు, కులు జిల్లాలోని భుంతార్ ప్రాంతానికి చెందిన శివానీ ఠాకూర్‌కు పెళ్లి చేయాల‌ని వీరి పెద్ద‌లు నిర్ణ‌యించారు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు కావాల్సిన ఏర్పాట్లు చేసుకున్నాయి. ఇవాళ పెళ్లి జ‌ర‌గాల్సి ఉంది. కానీ గ‌త నాలుగైదు రోజుల నుంచి ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు హిమాచ‌ల్‌లోని ప‌లు ప్రాంతాలు అత‌లాకుత‌లం అయ్యాయి.

వ‌ర‌ద‌లు పోటెత్తాయి. రోడ్లు ధ్వంసం అయ్యాయి. ప‌లు ప‌ట్ట‌ణాల మ‌ధ్య రాక‌పోక‌ల‌కు అంత‌రాయం ఏర్ప‌డింది. దీంతో ఆశిష్ సింఘాతో పాటు ఆయ‌న కుటుంబ స‌భ్యులు కులు ప్రాంతానికి చేరుకోలేక‌పోయారు.

ఇక చేసేదేమీ లేక నిర్ణ‌యించిన ముహుర్తానికి పెళ్లి చేయాల‌ని నిర్ణ‌యించుకున్న ఇరు కుటుంబాల పెద్ద‌లు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ఆశిష్, శివానీకి పెళ్లి చేశారు. ఈ వేడుక‌కు కుటుంబ స‌భ్యుల‌తో పాటు మాజీ ఎమ్మెల్యే రాకేశ్ సింగ్ కూడా హాజ‌రై.. నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. వ‌ర్షం సాక్షిగా ఒక్క‌టైన ఈ జంట‌కు శుభాకాంక్ష‌లు వెలువెత్తుతున్నాయి.