మాజీ సీఐ నాగేశ్వర్ రావు సర్వీసు నుంచి తొలగింపు
విధాత: మాజీ సీఐ నాగేశ్వర్ రావుకు తెలంగాణ పోలీసు శాఖ షాకిచ్చింది. నాగేశ్వర్ రావును సర్వీసు నుంచి తొలగిస్తూ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. నాగేశ్వర్ రావుపై అత్యాచారం, కిడ్నాప్ కింద వనస్థలిపురం పోలీసు స్టేషన్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే కొద్ది రోజుల క్రితమే కండిషన్ బెయిల్పై ఆయన విడుదలయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో సీవీ ఆనంద్.. నాగేశ్వర్ రావు పోలీసు సర్వీస్ నుంచి తొలగించారు. వనస్ధలిపురం పోలీసు స్టేషన్ […]

విధాత: మాజీ సీఐ నాగేశ్వర్ రావుకు తెలంగాణ పోలీసు శాఖ షాకిచ్చింది. నాగేశ్వర్ రావును సర్వీసు నుంచి తొలగిస్తూ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. నాగేశ్వర్ రావుపై అత్యాచారం, కిడ్నాప్ కింద వనస్థలిపురం పోలీసు స్టేషన్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే.
అయితే కొద్ది రోజుల క్రితమే కండిషన్ బెయిల్పై ఆయన విడుదలయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో సీవీ ఆనంద్.. నాగేశ్వర్ రావు పోలీసు సర్వీస్ నుంచి తొలగించారు. వనస్ధలిపురం పోలీసు స్టేషన్ పరిధిలోని హస్తినాపురంలో నివాసం ముండే మహిళపై ఈ ఏడాది జులై 7వ తేదీన రాత్రి 12 గంటలకు సీఐ నాగేశ్వరరావు అత్యాచారానికి పాల్పడినట్లు కేసు నమోదైంది.
అడ్డొచ్చిన ఆమె భర్తను గన్ తో బెదిరించి.. దంపతులను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కాగా, ఇబ్రహీంపట్నం చెరువు కట్ట వద్ద కారుకు యాక్సిడెంట్ కావడంతో బాధితులు తప్పించుకుని వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ బాగోతం బయటపడింది.
