ఘోరం: కిడ్నాప్ చేసి.. కూలీని రేప్ చేసిన నలుగురు అమ్మాయిలు
విధాత: మీరు చదువుతున్నది, మీకు ఇక్కడ కనబడితే నిజమే.. ఇప్పటి వరకు మగాళ్లు అత్యాచారం చేయడం చూసాం, రోజు వార్తల్లో వింటున్నాం కూడా. తాజాగా అమ్మాయిలు కూడా ఆ జాబితాలో చేరారు. మగాళ్లకు ఏ మాత్రం తీసిపోకుండా ఓ కూలీపై విరుచుకు పడ్డారు. పీకల దాకా మదం సేవించి అతనిపై అత్యాచారం చేశారు. ఈ దారుణ ఘటన పంజాబ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్‌లోని కపుర్తాల రోడ్డులోని ఓ లెదర్ ఫ్యాక్టరీలో కూలీగా పని […]

విధాత: మీరు చదువుతున్నది, మీకు ఇక్కడ కనబడితే నిజమే.. ఇప్పటి వరకు మగాళ్లు అత్యాచారం చేయడం చూసాం, రోజు వార్తల్లో వింటున్నాం కూడా. తాజాగా అమ్మాయిలు కూడా ఆ జాబితాలో చేరారు. మగాళ్లకు ఏ మాత్రం తీసిపోకుండా ఓ కూలీపై విరుచుకు పడ్డారు. పీకల దాకా మదం సేవించి అతనిపై అత్యాచారం చేశారు. ఈ దారుణ ఘటన పంజాబ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్‌లోని కపుర్తాల రోడ్డులోని ఓ లెదర్ ఫ్యాక్టరీలో కూలీగా పని చేస్తున్న ఓ కూలీ సోమవారం సాయంత్రం పని ముగించుకొని ఇంటికి వెళ్తున్నాడు. అదే సమయంలో అటుగా కారులో వచ్చిన నలుగురు అమ్మాయిలు, అతన్ని ఆపి ఓ పేపర్ మీద రాసి ఉంచిన అడ్రస్ అడిగారు.
అంతలోనే మరో అమ్మాయి కూలి కళ్లలోకి కెమికల్స్ స్ప్రే చేసి, బలవంతంగా కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడే అమ్మాయిలు మరోసారి మద్యం సేవించి కూలికి కూడా బలవంతంగా తాగించారు. ఆ తర్వాత కూలీ చేతులు, కాళ్ళు కట్టేసి నలుగురు కలిసి అతనిపై అత్యాచారం చేశారు. రాత్రంతా కూలీపై విరుచుకుపడి, పొద్దున్నే వదిలి పెట్టారు.
తనపై అత్యాచారం జరిగిన ఘటనను కూలీ మీడియాకు తెలిపాడు. ఈ ఈవిషయం పోలీసులకు చేరడంతో సుమోటాగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధిత కూలీ మాట్లాడుతూ.. ఆ నలుగురు పంజాబీ అమ్మాయిలని చెప్పాడు. ఇంగ్లీష్ బాగా మాట్లాడారని పేర్కొన్నాడు. ఉన్నతమైన కుటుంబాలకు చెందిన అమ్మాయిలై ఉంటారని వారి వయస్సు 22 నుంచి 25 వరకు ఉండొచ్చని తెలిపాడు. ఆ రాత్రి వారు నాకు నరకం చూపించారని వాపోయాడు.
అయితే ఇంతవరకు ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. పొలీసులు విచారిస్తేనే ఆ కూలీ చెప్పింది వాస్తవమా కాదా అని తేలుతుంది.