మరో ఏడాది పాటు ఉచిత రేషన్‌: కేంద్రం

విధాత: ఉచిత రేషన్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి వచ్చే సుమారు 81.35 కోట్ల మంది పేద ప్రజలకు ఏడాది పాటు ఉచితంగా బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ చట్టం ప్రకారం ప్రస్తుతం నెలకు కుటుంబంలో ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున కిలో రూ. 2-3 ధరకు అందిస్తున్న సంగతి తెలిసిందే. అంత్యోదయ అన్న యోజన కార్డు ఉన్న కుటుంబాలకైతే నెలకు 35 కిలోల చొప్పున ఆహారధాన్యాలు […]

  • By: krs    latest    Dec 24, 2022 7:02 AM IST
మరో ఏడాది పాటు ఉచిత రేషన్‌: కేంద్రం

విధాత: ఉచిత రేషన్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి వచ్చే సుమారు 81.35 కోట్ల మంది పేద ప్రజలకు ఏడాది పాటు ఉచితంగా బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది.

ఈ చట్టం ప్రకారం ప్రస్తుతం నెలకు కుటుంబంలో ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున కిలో రూ. 2-3 ధరకు అందిస్తున్న సంగతి తెలిసిందే.

అంత్యోదయ అన్న యోజన కార్డు ఉన్న కుటుంబాలకైతే నెలకు 35 కిలోల చొప్పున ఆహారధాన్యాలు పంపిణీ చేస్తున్నారు. కిలో బియ్యం రూ. 3లు కాగా కిలో గోధుమలను రూ. 2 లకే కేంద్రం అందిస్తున్నది.