Gaddar | ఆగిన యుద్ధనౌక ఊపిరి.. ప్రజాగాయకుడు గద్దర్ ఇకలేరు
Gaddar విధాత: ప్రముఖ ప్రజాగాయకుడు ప్రజాయుద్ధనౌక గద్దర్(76) అనారోగ్యంతో కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతన్న గద్దర్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గద్దర్ మృతిని ఆయన కుమారుడు సూర్య తెలిపారు. తూఫ్రాన్‌లో 1949లో జన్మించిన గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు తన ఆటపాటలతో జీవిత పర్యంతం విప్లవోద్యమానికి ఊపిరిలూదిన గద్దర్ తెలంగాణ ఉద్యమ ఉవ్వెత్తున ఎగసి పడటంలో కీలక భూమిక పోషంచారు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా అంటూ […]

Gaddar
విధాత: ప్రముఖ ప్రజాగాయకుడు ప్రజాయుద్ధనౌక గద్దర్(76) అనారోగ్యంతో కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతన్న గద్దర్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గద్దర్ మృతిని ఆయన కుమారుడు సూర్య తెలిపారు.
తూఫ్రాన్‌లో 1949లో జన్మించిన గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు తన ఆటపాటలతో జీవిత పర్యంతం విప్లవోద్యమానికి ఊపిరిలూదిన గద్దర్ తెలంగాణ ఉద్యమ ఉవ్వెత్తున ఎగసి పడటంలో కీలక భూమిక పోషంచారు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా అంటూ ప్రజల్లో తెలంగాణ ఉద్యమ చైతన్యాన్ని రగిలించారు.
పీపుల్స్ వార్ (మావోయిస్టు) పార్టీలో విస్తరణలో గద్దర్ ప్రజా గాయకుడిగా తనవంతూ చేయూతను పార్టీ కి అందించారు. గతంలో గద్దర్‌పై ఆగంతకులు జరిపిన కాల్పుల్లో ఆయన తీవ్రంగా గాయపడి కోలుకున్నారు. ఆయన వెన్నులో ఇప్పటికీ ఆనాటి కాల్పుల్లో దిగిన తూటా ఉండిపోయింది.
జూలై 31న గద్దర్ అపోలో ఆసుపత్రి నుంచి తన చికిత్సపై పత్రిక ప్రకటన విడుదల చేశారు. వెన్నుపూసలో విరుక్కున్న తూటా వయసు 25 సంవత్సరాలని ఇటీవల పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మద్దతుగా మా భూములు మాకే అనే నినాదంతో పాల్గొన్నానన్నారు. నాపేరు జనం గుండెల చప్పుడు నా గుండె చప్పుడు ఆగిపోలేదు.
కానీ ఎందుకో గుండెకు గాయమైంది. అందుకే చికిత్స కోసం ఆసుపత్రిలో చేరానని తెలిపారు. ఇటీవలే ఆయన గద్దర్ ప్రజా పార్టీ పేరుతో కొత్త పార్టీనీ స్థాపించారు. కొంతకాలంగా గద్దర్ అన్నీ పార్టీల నాయకత్వంతో సన్నిహితంగా మెలుగుతున్నారు.
విప్లవ ఉద్యమ పంథానుంచి ప్రజాస్వామిక ఆలోచనలకు ఓటు హక్కు రాజకీయాలవైపు మళ్లారు. గద్దర్ ఆకస్మిక మరణం విప్లవోద్యమానికి, పౌర ఉద్యమాలకు తీరని లోటుగా భావిస్తున్నారు. గద్దర్ మృతి పట్ల ప్రముఖ రాజకీయనాయకులు, కమ్యూనిస్టులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.