Gandeevadhari Arjuna Teaser : మెగా హీరో దుమ్ములేపేశాడు..హాలీవుడ్ రేంజ్‌లో గాండీవధారి అర్జున టీజర్‌

Gandeevadhari Arjuna Teaser : కంచె సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన వ‌రుణ్ తేజ్ ఆ త‌ర్వాత వైవిధ్య‌మైన ప్రాజెక్టులు ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. కామెడీ, యాక్ష‌న్, రొమాంటిక్ ఇలా డిఫ‌రెంట్ జాన‌ర్స్ ట‌చ్ చేస్తూ సినిమాలు చేస్తున్నాడు. గత కొద్ది రోజులుగా వ‌రుణ్ తేజ్ ‘గాండీవధారి అర్జున’ అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాని యాక్షన్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ తెరకెక్కిస్తుండ‌గా, ఈ మూవీని స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందించిన‌ట్టు తెలుస్తుంది. చిత్రానికి […]

  • By: sn    latest    Jul 24, 2023 7:40 AM IST
Gandeevadhari Arjuna Teaser :  మెగా హీరో దుమ్ములేపేశాడు..హాలీవుడ్ రేంజ్‌లో గాండీవధారి అర్జున టీజర్‌

Gandeevadhari Arjuna Teaser : కంచె సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన వ‌రుణ్ తేజ్ ఆ త‌ర్వాత వైవిధ్య‌మైన ప్రాజెక్టులు ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. కామెడీ, యాక్ష‌న్, రొమాంటిక్ ఇలా డిఫ‌రెంట్ జాన‌ర్స్ ట‌చ్ చేస్తూ సినిమాలు చేస్తున్నాడు. గత కొద్ది రోజులుగా వ‌రుణ్ తేజ్ ‘గాండీవధారి అర్జున’ అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాని యాక్షన్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ తెరకెక్కిస్తుండ‌గా, ఈ మూవీని స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందించిన‌ట్టు తెలుస్తుంది. చిత్రానికి సంబంధించి ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్రీ టీజర్ మూవీ ఎలా ఉండబోతుందో అనే చిన్న హిట్ ఇచ్చింది. ఇందులో యాక్షన్ స్టంట్స్ ఆడియ‌న్స్‌కి గూస్ బంప్స్ తెప్పించాయి. ఇక తాజాగా ఫుల్ టీజ‌ర్ రిలీజ్ చేయ‌గా, ఇది చూస్తుంటే చిత్ర క‌థ అంతా ఫారిన్ కంట్రీస్ లోనే సాగనుంది అని తెలుస్తుంది.

ప్రవీణ్ సత్తార్ సినిమాలో యాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో మ‌నం అర్ధం చేసుకోవ‌చ్చు. హాలీవుడ్ చిత్రాల‌ తరహాలో ఛేజ్ సీక్వెన్స్, అండర్ కవర్ ఆపరేషన్స్, అదిరిపోయే స్టంట్స్ ఉంటాయి. ఇప్పుడు గాండీవ‌ధారి అర్జున్ లో కూడా అవ‌న్నీ ఉండ‌బోతున్న‌ట్టు అర్ధ‌మ‌వుతుంది. టీజ‌ర్ చూసిన వాళ్లు తెలుగు టీజరా లేక హాలీవుడ్ చిత్రమా అనే అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. మరోసారి డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు యాక్షన్ చిత్రాల్లో తన సత్తా ఏంటో ఈ చిత్రంతో నిరూపించ‌బోతున్నాడు. వ‌రుణ్ తేజ్ కూడా స్ట‌న్నింగ్ లుక్‌లో క‌నిపించి అద‌ర‌గొట్టాడు. ఇక మిక్కీ జె మేయర్ అందించిన బిజియం అయితే ఎక్స్‌ట్రార్డిన‌రీ అని చెప్పాలి. ఇక డైలాగ్స్ కూడా సినిమాపై ఆస‌క్తిని రేపుతున్నాయి.

టీజ‌ర్ మాత్రం మూవీపై భారీ అంచ‌నాలే పెంచింది. సీక్రెట్ మిషన్ కి ఏజెంట్ గా వరుణ్ తేజ్ అల్ట్రా స్టైలిష్ లుక్ లో అద‌ర‌గొట్ట‌గా, చిత్రంలో సాక్షి వైద్య ఆయ‌న స‌ర‌స‌న క‌థానాయిక‌గా నటిస్తుంది. వరుణ్ తో పాటు సాక్షి కూడా యాక్షన్ స్టంట్స్ కూడా చేసింది. ఇక ఇందులో విమలా రామన్, నాజర్, వినయ్ రాయ్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఆగష్టు 25న ఈ సినిమాని భారీ ఎత్తున రిలీజ్ చేయ‌బోతున్నారు. కాగా, న‌వంబ‌ర్ లో వ‌రుణ్ తేజ్ – లావ‌ణ్య త్రిపాఠి వివాహం జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తుంది. కొన్నాళ్లుగా ప్రేమించుకున్న ఈ ఇద్ద‌రు జూన్ 9న నిశ్చితార్థం జ‌రుపుకున్నారు.