Ganja Racket: అటుహోలీ వేడుకలు.. ఇటు గంజాయి దందా!
హోలీ వేడుకల్లో గంజాయి వినియోగంపై అందిన సమాచారంతో ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ పోలీసులు జరిపిన తనిఖీల్లో విస్తుపోయే అంశాలు వెలుగుచూశాయి. తనిఖీల్లో గంజాయితో తయారు చేసిన కుల్ఫీ ఐస్ క్రీమ్ లు, బర్ఫీలు పోలీసులకు పట్టుబడ్డాయి.

Ganja racket: అక్రమార్కుల వ్యాపారాలకు కాదేది అనర్హమనడానికి.. హోలీ వేడుకలను సైతం గంజాయి వ్యాపారానికి వేదికగా మలుచుకున్న తీరు నిదర్శనంగా నిలుస్తుంది. గంజాయి, డ్రగ్స్ వంటి అక్రమ వ్యాపారాలు సాగించడంలో పోలీసుల కళ్లు కప్పేందుకు రకరకాల ఎత్తులు వేస్తున్నారు.
తాజాగా ధూల్ పేట మల్చిపురాలో హోలీ సందర్భంగా విక్రయిస్తున్న కుల్ఫీ ఐస్ క్రీమ్ లు, బర్ఫీలలో గంజాయి మిక్స్ చేసి విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు.
కుల్ఫీ ఐస్క్రీమ్లో గంజాయి బాల్స్ కలిపి తెలివిగా విక్రయిస్తున్నారు. గంజాయి ఐస్ క్రీమ్ దందాకు పాల్పడుతున్న సత్యనారాయణ సింగ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి బాల్స్ ను, ఐస్ క్రీమ్ లను స్వాధీనంచేసుకున్నారు.