INDIAN RAILWAY: రైల్లలోని చెత్త.. ట్రాక్ పైనే!
విధాత: పరిశుభ్రత విషయంలో భారతీయ రైల్వేలు తామే ఆదర్శమని చెప్పుకొంటాయి. ప్లాట్‌ఫారమ్‌లు, ట్రాక్‌ల పరిశుభ్రతతో పాటు రైల్వే స్టేషన్ల నిర్వహణకు ప్రాధాన్యమిస్తామని అంటుంటాయి. కానీ, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు వారెంత ప్రాధాన్యమిస్తారో వారి చర్యలు చెప్తున్నాయి. రైలులోని చెత్తనంతా ఊడ్చి దాన్ని ప్రత్యేక డంపు యార్డుల్లోకి తరలించాలి. అది రైల్వే ఉద్యోగుల బాధ్యత. కానీ రైల్వే ఉద్యోగులు చెత్తనంతా కదులుతున్న రైలులోంచి ట్రాక్ పైనే పడేస్తున్నారు. మిగిలిపోయిన ఆహార పదార్థాలను కూడా అలాగే పడేయటం అందోళన కలిగిస్తున్న […]

విధాత: పరిశుభ్రత విషయంలో భారతీయ రైల్వేలు తామే ఆదర్శమని చెప్పుకొంటాయి. ప్లాట్‌ఫారమ్‌లు, ట్రాక్‌ల పరిశుభ్రతతో పాటు రైల్వే స్టేషన్ల నిర్వహణకు ప్రాధాన్యమిస్తామని అంటుంటాయి. కానీ, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు వారెంత ప్రాధాన్యమిస్తారో వారి చర్యలు చెప్తున్నాయి.
రైలులోని చెత్తనంతా ఊడ్చి దాన్ని ప్రత్యేక డంపు యార్డుల్లోకి తరలించాలి. అది రైల్వే ఉద్యోగుల బాధ్యత. కానీ రైల్వే ఉద్యోగులు చెత్తనంతా కదులుతున్న రైలులోంచి ట్రాక్ పైనే పడేస్తున్నారు. మిగిలిపోయిన ఆహార పదార్థాలను కూడా అలాగే పడేయటం అందోళన కలిగిస్తున్న విషయం. దీంతో పరిసరాలు అశుభ్రంగా తయారవడమే కాదు దుర్గంధం వెదజల్లుతోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
This is daily affairs in thousands of Trains running across India, Thousand of tonnes of Trash which are meant to be recycled are thrown out of the running trains at random places which is a major threat to environment@RailMinIndia @RailwaySeva @AshwiniVaishnaw @DarshanaJardosh pic.twitter.com/FTnRYm8Aie
— Trains of India (@trains_of_india) December 2, 2022
ట్రాక్‌పై పడేసిన చెత్త, చెదారమంతా ట్రాక్ పొడుగునా ఉన్న గ్రామీణ మైదాన ప్రాంతాలను కాలుష్యమయం చేస్తుంది. పరిశుభ్రతను, పర్యావరణాన్ని కాపాడాల్సిన ఉద్యోగులే నిర్లక్ష్యంతో వ్యవహరిస్తుంటే.. పర్యావరణ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు పర్యావరణ ప్రేమికులు.