MLA Sunitha l నోరు జారిన ప్రభుత్వ విప్.. గ్యాస్ ధర పెంచే దాకా ఆందోళనలు ఆగవన్న MLA సునీత
Gas prices should be increased, MLA Sunitha.. విధాత: వంట గ్యాస్ ధరల పెంపుదలను నిరసిస్తూ బీఆర్ఎస్ (BRS) పార్టీ పిలుపు మేరకు శుక్రవారం నిర్వహించిన నిరసనలో ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత (MLA Sunitha) చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ (Viral)గా మారింది. గ్యాస్ (Gas) ధరల పెరుగుదలను నిరసిస్తూ తగ్గించాలన్న డిమాండ్‌తో చేపట్టిన ఆందోళనలో ఆమె ఏకంగా గ్యాస్ ధరలు పెంచే దాకా ఆందోళనలు ఆగబోవంటూ రెండు సార్లు […]

Gas prices should be increased, MLA Sunitha..
విధాత: వంట గ్యాస్ ధరల పెంపుదలను నిరసిస్తూ బీఆర్ఎస్ (BRS) పార్టీ పిలుపు మేరకు శుక్రవారం నిర్వహించిన నిరసనలో ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత (MLA Sunitha) చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ (Viral)గా మారింది. గ్యాస్ (Gas) ధరల పెరుగుదలను నిరసిస్తూ తగ్గించాలన్న డిమాండ్‌తో చేపట్టిన ఆందోళనలో ఆమె ఏకంగా గ్యాస్ ధరలు పెంచే దాకా ఆందోళనలు ఆగబోవంటూ రెండు సార్లు మాట్లాడటం అందరిని విస్మయ పరిచింది.
సునీత తన ప్రసంగం కొనసాగిస్తూ.. మహిళలు అంతా స్వచ్ఛందంగా నిరసన కార్యక్రమానికి వచ్చారని, గ్యాస్ ధరలు పెంచాల్సిందే మేడమ్ అని, ఎక్కడి దాకా అయినా పోదామంటున్నారని, ఆలేరులోనే రైలు ఎక్కి ఢిల్లీ (Delhi) దాకయినా పోదామంటున్నారని, తస్మాత్ జాగ్రత్త నరేంద్ర మోడీ.. మీరు వంట గ్యాస్ ధరలు పెంచేంత వరకు ఈ నిరసన కార్యక్రమాలు ఆగవంటూ మాట్లాడారు.
ఎమ్మెల్యే సునీతా తన ప్రసంగంలో గ్యాస్ ధరలు పెంచాల్సిందే అంటూ అన్యమస్కంగా మాట్లాడిన మాటలు నిరసనకు హాజరైన మహిళలను సైతం అవాక్కయ్యేలా చేశాయి. సునీత మాటల వీడియోలను బీజేపీ శ్రేణులయితే సోషల్ మీడియాలో వ్యంగ్యంగా పోస్ట్ చేస్తూ ఎద్దేవా చేస్తుండటంతో ఆ వీడియోలు వైరల్‌గా మారాయి.