సీఎం రేవంత్‌రెడ్డితో జర్మనీ రాయబారి డాక్టర్ ఫిలిఫ్ అకర్‌మన్ భేటీ
జర్మనీ రాయభారి డాక్టర్ ఫిలిఫ్ అకర్‌మన్ బుధవారం సీఎం రేవంత్‌రెడ్డిని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు

విధాత : జర్మనీ రాయభారి డాక్టర్ ఫిలిఫ్ అకర్‌మన్ బుధవారం సీఎం రేవంత్‌రెడ్డిని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. భారతదేశంతో వ్యూహాత్మక భాగస్వామిగా జర్మనీ వ్యవసాయం, ఆటోమేషన్, టూరిజం, ఫార్మసీ రంగాల్లో కొనసాగుతుంది. ఆయా రంగాల్లో ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలపై ఇరువురు చర్చించారు.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
ఫార్మాతో పాటు పలు రంగాల్లో తెలంగాణ నుంచి జరుగుతున్న ఎగుమతులు, నూతన పెట్టుబడుల అంశంపై చర్చించారు. తెలంగాణ పెట్టుబడులకు అనువైన ప్రాంతమని జర్మనీ రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొస్తే అవసరమైన సహకారం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.