Exams | మీకు తెలుసా.. పరీక్షల పద్ధతిని ప్రవేశపెట్టింది ఈయనే..!

Exams | మీకు తెలుసా.. పరీక్షల పద్ధతిని ప్రవేశపెట్టింది ఈయనే..!

Exams: ఈ పరీక్షలు కనిపెట్టిందో ఎవడోగానీ.. దొరికితే గొంతు పిసికి చంపేద్దును..! ఈ పరీక్షలు ఎవడు కనిపెట్టిండు రా నాయనా.. బుర్ర బద్దలైపోతుంది..! ఈ పరీక్షలతోటి సావొచ్చిందిరా బాబూ.. వాడెవడో దొరికితేనా..! అంటూ కొంతమంది విద్యార్థులు పరీక్షల గురించి ఇలాంటి కామెంట్స్‌ చేస్తుంటారు. సాధారణంగా చదువుపై ఎక్కువగా శ్రద్ధపెట్టని వాళ్లకే ఈ విధంగా కోపం వస్తుంటుంది. చదివే వాడికి ఎప్పుడూ పరీక్షలు రాయాలని, తన టాలెంట్‌ను నిరూపించుకోవాలనే ఆరాటం ఉంటుంది.

అయితే పరీక్షల కనిపెట్టినవాడు దొరికితే చంపేస్తాం అనే వాళ్లకు ఇది శుభవార్త. ఎందుకంటే చదువులో ఈ పరీక్షల పద్ధతిని కనిపెట్టిన వ్యక్తి ఎవరో ఇప్పుడు చెప్పబోతున్నాం. అయితే, అతనెవరో చెప్పినా అతన్ని మీరిప్పుడు ఏమీ చేయలేరు. ఎందుకో తెలుసా..? అతనిప్పుడు బతికిలేడు. ఏదో కోపంలో అంటాం గానీ బతికుంటే మాత్రం చంపేస్తామా ఏంటి..? చంపం కదా..! కానీ వేల మంది విద్యార్థులతో తిట్లు తినే అతనెవరో తెలుసుకోవాలనే ఆసక్తి మనలో కలుగడం సహజం.

కాబట్టి ఇప్పుడు అతనెవరో తెలుసుకుందాం. అతను ఒక ప్రొఫెసర్‌. జర్మనీకి చెందిన ప్రొఫెసర్‌. అగ్రరాజ్యం అమెరికాలో స్థిరపడిన జర్మనీ ప్రొఫెసర్‌. అతని పేరు హెన్రీ ఫిషెల్‌. ఈ హెన్రీ ఫిషెల్‌ ఇండియానా యూనివర్సిటీలో పనిచేస్తున్నప్పుడు ఈ పరీక్షల పద్ధతిని ప్రవేశపెట్టాడు. అప్పటి నుంచి ఈ పరీక్షల పద్ధతి అన్ని దేశాల్లోని అన్ని విద్యాసంస్థలకు పాకి ఇప్పటికీ అమలు జరుగుతున్నది.