Klin Kaara | గోల్డ్, డైమండ్స్‌తో క్లీంకార‌కు గిఫ్ట్స్.. మురిసిపోతున్న చరణ్, ఉపాసన

Klin Kaara | మెగా ఫ్యామిలీలోకి కాస్త లేట్‌గా వచ్చినా ఆ కుటుంబాన్ని ఆనందంలో ముంచేస్తూ సంతోషాన్ని తెచ్చిన చిరంజీవి మనుమరాలు.. హీరో రామ్ చరణ్, ఉపాసన కూతురు క్లీంకార విషయంలో ఏ చిన్న కబురు తెలిసినా అది నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. తాత, తండ్రిని మించి సెలబ్రెటీ స్థానాన్ని పుట్టుకతోనే సంపాదించేసుకుందీ చిట్టితల్లి. తన పుట్టుక విషయం నుంచి. పేరు ఏం పెడుతున్నారు, ఎవరెవరు ఫంక్షన్ కు వస్తున్నారు వరకూ, ఆపైన పాప ఆలనా […]

  • By: krs    latest    Aug 09, 2023 5:11 AM IST
Klin Kaara | గోల్డ్, డైమండ్స్‌తో క్లీంకార‌కు గిఫ్ట్స్.. మురిసిపోతున్న చరణ్, ఉపాసన

Klin Kaara |

మెగా ఫ్యామిలీలోకి కాస్త లేట్‌గా వచ్చినా ఆ కుటుంబాన్ని ఆనందంలో ముంచేస్తూ సంతోషాన్ని తెచ్చిన చిరంజీవి మనుమరాలు.. హీరో రామ్ చరణ్, ఉపాసన కూతురు క్లీంకార విషయంలో ఏ చిన్న కబురు తెలిసినా అది నెట్టింట వైరల్ అవుతూనే ఉంది.

తాత, తండ్రిని మించి సెలబ్రెటీ స్థానాన్ని పుట్టుకతోనే సంపాదించేసుకుందీ చిట్టితల్లి. తన పుట్టుక విషయం నుంచి. పేరు ఏం పెడుతున్నారు, ఎవరెవరు ఫంక్షన్ కు వస్తున్నారు వరకూ, ఆపైన పాప ఆలనా పాలనా ఇలా చాలా విషయాలు మెగా ఫ్యామిలీ నుంచి వైరల్ అవుతూనే ఉన్నాయి. కొందరైతే మెగా ప్రిన్సెస్ అని కూడా అంటున్నారు.

క్లీంకార పుట్టక ముందు నుంచే సెలబ్రెటీ స్థానాన్ని పొందింది. లోకల్, నేషనల్ అని తేడా లేకుండా అన్నింటిలోనూ క్లీంకార వైరల్ అవుతూ వచ్చింది. అయితే క్లీంకారకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. క్లీంకారకు రామ్ చరణ్ తరపున, ఉపాసన తరపు నుంచి చాలా బహుమతులు అందుతున్నాయట.

రీసెంట్‌గా జూనియర్ ఎన్టీఆర్ నుంచి బంగారు డాలర్లతో చేసిన గిఫ్ట్ అందించారనే వార్త వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు అల్లు అర్జున్ దంపతులు కూడా పాపకు మంచి గిప్ట్ ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. క్లీంకారకు అల్లు అర్జున్ బంగారంతో తయారు చేసిన నేమ్ ఫ్లేట్‌ను బహుమతిగా ఇచ్చారట. దీనిమీద క్లీంకార అనే పేరు బంగారు అక్షరాలతో ఉంటుందని వీటి చుట్టూ డైమండ్స్ పొదిగి ఉన్నాయని తెలుస్తోంది.

బన్నీ పంపిన గిఫ్ట్ చూడగానే రామ్ చరణ్, ఉపాసన‌లకు తెగ నచ్చేసిందట. పాప పేరు డైమండ్స్ మధ్య గోల్డ్ కలర్‌లో మెరుస్తూ ఉంటే.. నీ ఫ్యూచర్ కూడా ఇలా ఉండాలి తల్లి అని ఆ తల్లిదండ్రులిద్దరూ మనసులో థ్యాంక్స్ చెప్పుకున్నారనేలా మెగా సర్కిల్స్‌ నుంచి వార్త వినిపిస్తోంది.

ఈ బుజ్జి మెగా ప్రిన్స్ పుట్టగానే లక్కీ గర్ల్ తాత, తండ్రి, తల్లి మావయ్యలు ఇలా అంతా సెలబ్రెటీల స్థానంలో ఉన్నందువల్ల క్లీంకార విలువైన బహుమతులతోనే కాదు. మీడియాలో రోజుకో న్యూస్ తో వైరల్ అవుతూ వస్తుంది.

ఇక పెద్దయ్యాకా వీళ్ళందరినీ దాటేసి మరీ.. స్టార్ అవుతుందేమో చూడాలి. ఇప్పటికే మహేష్ కుమార్తె, అల్లు అర్జున్ కుమార్తె ఓ బెంచ్ మార్క్‌ని సెట్ చేసి పెట్టారు. ఆ మార్క్‌ని క్లీంకార ఈజీగా బీట్ చేస్తుందని మెగా ఫ్యాన్స్ అనుకుంటుండటం విశేషం.