బాలిక గొంతు కోసి అడవిలో పడేశాడు.. కానీ ఆమె తిరిగొచ్చింది!
విధాత: ఓ 26 ఏండ్ల వ్యక్తి మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నాడు. ఆమె వేరొకరితో సన్నిహితంగా ఉంటే జీర్ణించుకోలేక.. కోపంతో రగిలిపోయేవాడు. ఆ బాలికను అసభ్య పదజాలంతో దూషించి, హింసించేవాడు. ఇటీవల ఓ అబ్బాయితో కలిసి దుర్గామాత పూజకు వెళ్లడంతో.. ఆమెను కిడ్నాప్ చేసి గొంతు కోసేశాడు. ఆ తర్వాత అడవిలో పడేశాడు. కానీ ఆమె ప్రాణాలతో తిరిగొచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. అసోంలోని కాచర్ జిల్లాకు చెందిన ఓ 26 ఏండ్ల యువకుడు […]

విధాత: ఓ 26 ఏండ్ల వ్యక్తి మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నాడు. ఆమె వేరొకరితో సన్నిహితంగా ఉంటే జీర్ణించుకోలేక.. కోపంతో రగిలిపోయేవాడు. ఆ బాలికను అసభ్య పదజాలంతో దూషించి, హింసించేవాడు. ఇటీవల ఓ అబ్బాయితో కలిసి దుర్గామాత పూజకు వెళ్లడంతో.. ఆమెను కిడ్నాప్ చేసి గొంతు కోసేశాడు. ఆ తర్వాత అడవిలో పడేశాడు. కానీ ఆమె ప్రాణాలతో తిరిగొచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. అసోంలోని కాచర్ జిల్లాకు చెందిన ఓ 26 ఏండ్ల యువకుడు తనను ప్రేమించాలని ఓ మైనర్‌ను తీవ్ర ఒత్తిడికి గురి చేశాడు. అతని ప్రేమను ఆమె అంగీకరించలేదు. అయితే అక్టోబర్ 3వ తేదీన దుర్గామాత పూజకు మరో యువకుడితో కలిసి బాలిక వెళ్లింది. ఈ విషయం ఆ ప్రేమోన్మాదికి తెలిసింది.
దీంతో అదే రోజు ఆమెను రాత్రి సమయంలో కిడ్నాప్ చేశాడు. బాలిక గొంతు కోసి ఓ బ్యాగులో కుక్కేశాడు. అనంతరం ఆ బ్యాగును అడవిలో పడేశాడు. మరుసటి రోజు మధ్యాహ్నం ఆమె చిరిగిన బట్టలతో గ్రామంలోకి వచ్చింది. తీవ్ర రక్త స్రావంతో బాధ పడుతున్న బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.