బాలికలకు స్వీయరక్షణ అవసరం: స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
విధాత, నిజామాబాదు: బాలికలకు స్వీయ రక్షణ అవసరమని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అమ్మాయిలు ఎదగడానికి మానసిక, శారీరక శక్తి రెండు అవసరమన్నారు. బాన్సువాడ పట్టణం లోని కొయ్యగుట్ట సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో శుక్రవారం వాయిస్ ఫర్ గర్ల్స్ ముగింపు కార్యక్రమంలో స్పీకర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రశాంగించారు. స్వయం శక్తితో మహిళలు నిర్ణయాలు తీసుకునే విధంగా తయారు చేయడమే ఈ కార్యక్రమ ఉద్దేశ్యమన్నారు. జనాభాలో మహిళలు సగం మంది వున్నారని, […]

విధాత, నిజామాబాదు: బాలికలకు స్వీయ రక్షణ అవసరమని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అమ్మాయిలు ఎదగడానికి మానసిక, శారీరక శక్తి రెండు అవసరమన్నారు. బాన్సువాడ పట్టణం లోని కొయ్యగుట్ట సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో శుక్రవారం వాయిస్ ఫర్ గర్ల్స్ ముగింపు కార్యక్రమంలో స్పీకర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రశాంగించారు.
స్వయం శక్తితో మహిళలు నిర్ణయాలు తీసుకునే విధంగా తయారు చేయడమే ఈ కార్యక్రమ ఉద్దేశ్యమన్నారు. జనాభాలో మహిళలు సగం మంది వున్నారని, వారు ఇతరులపై ఆధార పడకుండా ఉండాలన్నారు.
మానసిక శక్తి ఆయా రంగాల్లో గమ్యానికి చేర్చితే, శారీరక శక్తి తనను తాను కాపాడుకోవడానికి ఉపయోగ పడుతుందని పోచారం సూచించారు. సమాజం, కుటుంబం బాగుపడాలంటే మహిళలు తప్పనిసరిగా చదువుకోవాలని హితవు పలికారు. నిర్ణయాలు తీసుకునే బలం మహిళలకు రావాలని ఆకాంక్షించారు.
సరైన జీవిత భాగస్వామిని నిర్ణయించుకునే ధైర్యం, స్వతంత్రత మహిళలకు రావాలన్నారు.
మహిళలు తలుచుకుంటే సాదించలేనిది ఏమీ లేదన్నారు. మౌళిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వపరంగా తమ వంతన్నారు. వాటిని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందడానికి విద్యార్థులు కృషి చేయాలన్నారు.
దేశ అభివృద్ధి విద్యార్థుల చేతుల్లో ఉందన్నారు. విద్య అవసరాలను మెరుగు పర్చేందుకు బాన్సువాడ ప్రాంతంలో బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు, కాలేజీలు మంజూరు చేయించానని గుర్తు చేశారు.
ఈ ఏడాది బాన్సువాడకు బాలికల ఉర్ధూ మీడియం డిగ్రీ కాలేజీ మంజూరు అయిందని చెప్పారు.
త్వరలోనే బాన్సువాడకు ఎస్టీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు కానున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు, బాలికలు పాల్గొన్నారు.