హెడ్‌మాస్ట‌ర్‌ను క‌ర్ర‌ల‌తో చిత‌క‌బాదిన అమ్మాయిలు.. ఎందుకంటే..?

విధాత: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ప్ర‌ధానోపాధ్యాయుడు కీచ‌కుడిగా మారాడు. హాస్ట‌ల్‌లో ఉంటున్న ఆ అమ్మాయిల‌ను కంటికి రెప్ప‌లా కాపాడుకోవాల్సింది పోయి.. కామంతో చెల‌రేగిపోయాడు. ఓ విద్యార్థిని ప‌ట్ల అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించాడు. విష‌యం తెలుసుకున్న మిగ‌తా అమ్మాయిలు హెడ్‌మాస్ట‌ర్‌పై క‌ర్ర‌ల‌తో దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని మాండ్యా జిల్లా ప‌రిధిలోని క‌ట్టేరి ప్ర‌భుత్వ ఉన్న‌త పాఠ‌శాల వ‌స‌తి గృహాంలో వెలుగు చూసింది. క‌ట్టేరి ప్ర‌భుత్వ ఉన్న‌త పాఠ‌శాల‌కు అనుబంధంగా విద్యార్థినుల కోసం ప్ర‌త్యేక హాస్ట‌ల్ […]

  • By: krs    latest    Dec 17, 2022 6:06 AM IST
హెడ్‌మాస్ట‌ర్‌ను క‌ర్ర‌ల‌తో చిత‌క‌బాదిన అమ్మాయిలు.. ఎందుకంటే..?

విధాత: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ప్ర‌ధానోపాధ్యాయుడు కీచ‌కుడిగా మారాడు. హాస్ట‌ల్‌లో ఉంటున్న ఆ అమ్మాయిల‌ను కంటికి రెప్ప‌లా కాపాడుకోవాల్సింది పోయి.. కామంతో చెల‌రేగిపోయాడు. ఓ విద్యార్థిని ప‌ట్ల అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించాడు. విష‌యం తెలుసుకున్న మిగ‌తా అమ్మాయిలు హెడ్‌మాస్ట‌ర్‌పై క‌ర్ర‌ల‌తో దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని మాండ్యా జిల్లా ప‌రిధిలోని క‌ట్టేరి ప్ర‌భుత్వ ఉన్న‌త పాఠ‌శాల వ‌స‌తి గృహాంలో వెలుగు చూసింది.

క‌ట్టేరి ప్ర‌భుత్వ ఉన్న‌త పాఠ‌శాల‌కు అనుబంధంగా విద్యార్థినుల కోసం ప్ర‌త్యేక హాస్ట‌ల్ ఉంది. అయితే ఆ పాఠ‌శాల హెడ్‌మాస్ట‌ర్ కూడా అక్క‌డే ఉన్నాడు. ఓ విద్యార్థిని ప‌ట్ల ప్ర‌ధానోపాధ్యాయుడు అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించాడు. తాక‌రాని చోట లైంగిక వేధింపుల‌కు గురి చేశాడు.

దీంతో అప్ర‌మ‌త్త‌మైన బాధితురాలు త‌న స్నేహితురాండ్ల‌కు చెప్పింది. విద్యార్థినులంద‌రూ క‌లిసి క‌ర్ర‌ల‌తో హెడ్‌మాస్ట‌ర్‌పై దాడి చేశారు. ఓ గ‌దిలో దాచుకునేందుకు ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ అత‌న్ని వ‌ద‌ల్లేదు.
గ‌తంలో కూడా హెడ్‌మాస్ట‌ర్ ప‌లు విద్యార్థినుల‌ను లైంగికంగా వేధించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

ఈ ఒక్క అమ్మాయి త‌న‌కు జ‌రిగిన అవ‌మానంపై గొంతు విప్ప‌డంతో.. గ‌తంలో త‌మ‌కు జ‌రిగిన వేధింపుల‌ను కూడా విద్యార్థినులు బ‌య‌ట‌పెట్టారు. విద్యార్థినుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు పోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. వేధింపుల‌కు పాల్ప‌డ్డ హెడ్‌మాస్ట‌ర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.