Gold Price Today | బంగారం కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్‌.. హైదరాబాద్‌లో తులం బంగారం ఎంతంటే..?

Gold Price Today | బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఇది శుభవార్తే. ఇటీవలి వరుసగా రోజురోజుకు పైకి కదులుతూ ఆల్‌ టైం గరిష్ఠ స్థాయికి ధరలు చేరిన విషయం తెలిసిందే. అయితే, గత రెండు సెషన్లలో బంగారం ధరలు కాస్త తగ్గుముఖంపట్టాయి. అంతర్జాతీయంగా, దేశీయంగా బంగారానికి భారీగానే డిమాండ్‌ ఉంటున్నది. అమెరికా ఫెడ్ సహా ఇతర కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్లు పెరిగి రికార్డు స్థాయికి చేరుతున్నాయి. దాంతో ఈ ప్రభావం బంగారంపై పడుతున్నది. […]

Gold Price Today | బంగారం కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్‌.. హైదరాబాద్‌లో తులం బంగారం ఎంతంటే..?

Gold Price Today | బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఇది శుభవార్తే. ఇటీవలి వరుసగా రోజురోజుకు పైకి కదులుతూ ఆల్‌ టైం గరిష్ఠ స్థాయికి ధరలు చేరిన విషయం తెలిసిందే. అయితే, గత రెండు సెషన్లలో బంగారం ధరలు కాస్త తగ్గుముఖంపట్టాయి. అంతర్జాతీయంగా, దేశీయంగా బంగారానికి భారీగానే డిమాండ్‌ ఉంటున్నది. అమెరికా ఫెడ్ సహా ఇతర కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్లు పెరిగి రికార్డు స్థాయికి చేరుతున్నాయి. దాంతో ఈ ప్రభావం బంగారంపై పడుతున్నది.

ఈ క్రమంలో కొద్ది రోజులుగా బంగారం ధర గరిష్ఠాన్ని చేరింది. అయితే, అంతర్జాతీయంగా చూసుకుంటే స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు మరింత పైపైకి కదులుతున్నది. ప్రస్తుతం ఔన్సుకు 2007.75 డాలర్లు పలుకుతున్నది. వెండి రేటు ఔన్సుకు 25 డాలర్ల వద్ద అమ్ముడవుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే.. భారత కరెన్సీ రూపాయి మారకం విలువ ప్రస్తుతం రూ.81.888 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్ మార్కెట్లో బంగారం 10 గ్రాములకు 22 క్యారెట్ల ధర స్థిరంగా ఉన్నది. ప్రస్తుతం తులం బంగారం రూ.55,800 పలుకుతోంది.

ఇక 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.60,870 పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.55,950 వద్ద ట్రేడవుతోంది. 24 క్యారెట్ల గోల్డ్‌ ప్రస్తుతం రూ.61,020 పలుకుతోంది. వెండి విషయానికి వస్తే బంగారంతో సమానంగా దూసుకెళ్తోంది. హైదారాబాద్‌లో కిలో వెండి రేటు రూ.80,200 పలుకుతోంది. ఢిల్లీలో వెండి ధర రూ.76,600 వద్ద కొనసాగుతోంది. అయితే, హైదరాబాద్‌ – ఢిల్లీ నగరాల్లో బంగారం ధరల్లో స్వల్పంగా తేడాలున్నాయి. దీనికి ఆయా రాష్ట్రాల్లో ఉన్న ట్యాక్స్‌ల కారణంగా ధరల్లో స్వల్పంగా మార్పులుంటాయి.