Gold Price | బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన పుత్తడి ధర..! తులం ఎంత పలుకుతుందంటే..?

Gold Price | విధాత: భారత్‌లో బంగారానికి భారీ డిమాండ్‌ ఉంటుంది. ఇటీవల కొద్దిరోజులుగా బంగారం ఆకాశాన్నంటుతుండడంతో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఒక దశలో తులం బంగారం ధర రూ.60వేల మార్క్‌ను దాటింది. అయితే, బంగారం ధర ఇవాళ కాస్త తగ్గింది. అమెరికా డాలర్ పుంజుకోవడంతో బంగారం ధర పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం ధరలు తగ్గడంతో.. దేశీయ మార్కెట్లోనూ దిగి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర ఔన్స్‌కు 1977.70 వద్ద ట్రేడవుతోంది. క్రితం సెషన్ […]

Gold Price | బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన పుత్తడి ధర..! తులం ఎంత పలుకుతుందంటే..?

Gold Price |

విధాత: భారత్‌లో బంగారానికి భారీ డిమాండ్‌ ఉంటుంది. ఇటీవల కొద్దిరోజులుగా బంగారం ఆకాశాన్నంటుతుండడంతో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఒక దశలో తులం బంగారం ధర రూ.60వేల మార్క్‌ను దాటింది. అయితే, బంగారం ధర ఇవాళ కాస్త తగ్గింది.

అమెరికా డాలర్ పుంజుకోవడంతో బంగారం ధర పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం ధరలు తగ్గడంతో.. దేశీయ మార్కెట్లోనూ దిగి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర ఔన్స్‌కు 1977.70 వద్ద ట్రేడవుతోంది.

క్రితం సెషన్ ముగింపు 1988 డాలర్లతో చూస్తే 0.58 శాతం మేర తగ్గింది. వెండి ధర ఔన్స్‌కు ప్రస్తుతం 23.25 డాలర్ల వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో బంగారం ధర 22 క్యారెట్లకు 150 మేర తగ్గింది. ప్రస్తుతం రూ.54 వేల 850 వద్ద కొనసాగుతోంది.

24 క్యారెట్ల పసిడి ధర తులానికి రూ.160 మేర తగ్గి రూ.59,840కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 మేర తగ్గి రూ.54, 950, 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 తగ్గి.. రూ.59,990 వద్ద స్థిరపడింది.

హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.300 మేర పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.76 వేలు పలుకుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి రూ.330 మేర పెరిగి ప్రస్తుతం రూ.73,300 వద్ద కొనసాగుతున్నది.