Gold Rate | బంగారం ప్రియులకు రిలీఫ్‌..! నేడు ధరలు ఎలా ఉన్నాయంటే..?

Gold Rate | బంగారం ధరలు కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. మొన్న స్వల్పంగా తగ్గిన ధరలు ఆదివారం భారీగా పెరిగాయి. సోమవారం బులియన్‌ మార్కెట్‌లో స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల తులం బంగారం రూ.55,350 ఉండగా.. 24 క్యారెట్ల తులం గ్రాముల గోల్డ్‌ రేటు రూ.60,380 వద్ద కొనసాగుతున్నాయి . దేశంలోని పలు రాష్ట్రాల్లో తులం బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం రూ.55,500 ఉండగా.. 24 క్యారెట్ల […]

Gold Rate | బంగారం ప్రియులకు రిలీఫ్‌..! నేడు ధరలు ఎలా ఉన్నాయంటే..?

Gold Rate | బంగారం ధరలు కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. మొన్న స్వల్పంగా తగ్గిన ధరలు ఆదివారం భారీగా పెరిగాయి. సోమవారం బులియన్‌ మార్కెట్‌లో స్థిరంగా కొనసాగుతున్నాయి.

22 క్యారెట్ల తులం బంగారం రూ.55,350 ఉండగా.. 24 క్యారెట్ల తులం గ్రాముల గోల్డ్‌ రేటు రూ.60,380 వద్ద కొనసాగుతున్నాయి

. దేశంలోని పలు రాష్ట్రాల్లో తులం బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం రూ.55,500 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.60,530 వద్ద ట్రేడవుతున్నది.

చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.55,650 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం ధర రూ.60,710 వద్ద స్థిరంగా ఉన్నది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,350 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రేటు రూ.60,380 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.77వేలు ఉన్నది. వెండి ధరలు సైతం మారలేదు. హైదరాబాద్‌లో కిలో రూ.80వేలు పలుకుతున్నది. మరో వైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం దర స్వల్పంగా దిగి వచ్చింది.

ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1958 డాలర్ల వద్ద పలుకుతున్నది. స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 24. 35 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.

భారతీయ కరెన్సీ రూపాయి మారకం విలువ డాలర్‌తో పోల్చి చూస్తే ఇవాళ మరింత దిగజారింది. ప్రస్తుతం రూ.82.253 వద్ద కొనసాగుతున్నది. అంతర్జాతీయంగా బంగారం ధరలు పతనమవుతున్నా దేశంలో మాత్రం తగ్గడం లేదు.