Gold Rate | రెండు వారాల గరిష్ఠానికి గోల్డ్ రేటు..! దేశంలో పెరిగిన ధరలు.. వెండి ఒకే రోజు కిలోకు రూ.1600 పైపైకి..!
Gold Rate | అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు రెండువారాల గరిష్ఠ స్థాయిలో కొనసాగుతున్నది. జాక్సల్ హోలో మీటింగ్ నేపథ్యంలో గరిష్ఠానికి చేరింది. ప్రస్తుతం బంగారం ధర ఔన్స్‌కు 1,949 డాలర్లు పలుకుతున్నది. ఇక భారత మార్కెట్లలో బంగారం ధర పెరిగింది. 22 క్యారెట్ల బంగారంపై రూ.2000 పెరిగింది. 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ.220, కిలో వెండి రేటు ఒకేసారి రూ.1600 పెరిగింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారంపై […]

Gold Rate |
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు రెండువారాల గరిష్ఠ స్థాయిలో కొనసాగుతున్నది. జాక్సల్ హోలో మీటింగ్ నేపథ్యంలో గరిష్ఠానికి చేరింది. ప్రస్తుతం బంగారం ధర ఔన్స్‌కు 1,949 డాలర్లు పలుకుతున్నది.
ఇక భారత మార్కెట్లలో బంగారం ధర పెరిగింది. 22 క్యారెట్ల బంగారంపై రూ.2000 పెరిగింది. 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ.220, కిలో వెండి రేటు ఒకేసారి రూ.1600 పెరిగింది.
దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారంపై రూ.54,500 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.59,600 పెరిగింది.
ముంబయిలో 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.54,500 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.59,450 చేరింది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,830 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.59,820కి చేరింది.
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం రేటు రూ.54,500 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రేటు రూ.59,450 వద్ద కొనసాగుతున్నది.
ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం రూ.54,500 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.59,400 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
ఇక వెండి ధర విషయానికి వస్తే ఒకే రోజు కిలోకు రూ.1600 వరకు పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలోకు రూ.80వేలకు పెరిగింది.