Gold Rate | స్వల్పంగా తగ్గిన బంగారం.. పెరిగిన వెండి రేటు..! హైదరాబాద్‌లో ధరలు ఎలా ఉన్నాయంటే..?
Gold Rate | బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. గత రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతూ వచ్చిన ధరలు.. మంగళవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. పది గ్రాముల బంగారంపై రూ.20 తగ్గి.. రూ.54,980 పలుకుతున్నది. 24 క్యారెట్ల బంగారంపై సైతం రూ.20 తగ్గి రూ.59,980 పలుకుతున్నది. మరో వైపు వెండి ధర మళ్లీ పెరిగింది. కిలోకు రూ.200 పెరుగుదల నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం రూ.55,130 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు […]

Gold Rate | బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. గత రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతూ వచ్చిన ధరలు.. మంగళవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. పది గ్రాముల బంగారంపై రూ.20 తగ్గి.. రూ.54,980 పలుకుతున్నది. 24 క్యారెట్ల బంగారంపై సైతం రూ.20 తగ్గి రూ.59,980 పలుకుతున్నది.
మరో వైపు వెండి ధర మళ్లీ పెరిగింది. కిలోకు రూ.200 పెరుగుదల నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం రూ.55,130 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.60,130గా ఉన్నది. ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.54,980 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.59,980కి చేరింది.
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,360 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.60,390 వద్ద ట్రేడవుతున్నది. బెంగళూరులో 22 క్యారెట్ల రూ.54,980 ఉండగా.. 24క్యారెట్ల బంగారంరూ.59,980 వద్ద కొనసాగుతున్నది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,980 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.59,980 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతితో పాటు పలు నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
ఇక వెండి విషయానికి వస్తే దేశీయ మార్కెట్‌లో వెండి ధర మరోసారి భారీగానే పెరిగింది. కిలోకు రూ.200 పెరిగి రూ.77,700 పలుకుతున్నది. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.81,500 పెరిగింది.