Gold Rate | నేడు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?
Gold Rate | నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు మార్కెట్‌లో సోమవారం స్థిరంగా కొనసాగుతున్నాయి. నిన్న 22 క్యారెట్ల బంగారంపై రూ.400 వరకు పెరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మార్కెట్‌లో రూ.54,700 వద్ద కొనసాగుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.54,700 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.59,660 వద్ద స్థిరంగా ఉన్నది. చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.54,900 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.59,940 వద్ద కొనసాగుతున్నది. ముంబయిలో 22 […]

Gold Rate | నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు మార్కెట్‌లో సోమవారం స్థిరంగా కొనసాగుతున్నాయి. నిన్న 22 క్యారెట్ల బంగారంపై రూ.400 వరకు పెరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మార్కెట్‌లో రూ.54,700 వద్ద కొనసాగుతున్నది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.54,700 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.59,660 వద్ద స్థిరంగా ఉన్నది. చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.54,900 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.59,940 వద్ద కొనసాగుతున్నది.
ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.54,550 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.59,510 పలుకుతున్నది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,550 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,510 వద్ద ట్రేడవుతున్నది.
ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధరలు సైతం స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్‌లో కిలో రూ.76,700 పలుకుతున్నది.
ఇదిలా ఉండగా.. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1925 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.
స్పాట్ సిల్వర్ రేటు 23.08 డాలర్ల వద్ద కొనసాగుతున్నది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.68 వద్ద ట్రేడవుతున్నది.