Singareni | సింగరేణి కార్మికులకు శుభవార్త.. 23 నెలల బకాయిలు చెల్లింపు
Singareni | విధాత ప్రతినిధి ఉమ్మడి ఆదిలాబాద్: సింగరేణి కార్మికులకు 11వ వేజ్ బోర్డుకు సంబంధించిన 23 నెలల బకాయిలను మొత్తం ఒకే దఫా ఈ నెల 21న చెల్లించనున్నారు. ఈమేరకు సింగరేణి యాజమాన్యం అంగీకరించిందని టీబీజీకేఎస్ శ్రీరాంపూర్ ఏరియా ఆర్గనైజింగ్ సెక్రటరీ రౌతు సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం టీబీజీకేఎస్ యూనియన్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, అధ్యక్షుడు వెంకట్రావు కోరిక మేరకు బకాయిలను మొత్తం ఒకే దఫా […]

Singareni |
విధాత ప్రతినిధి ఉమ్మడి ఆదిలాబాద్: సింగరేణి కార్మికులకు 11వ వేజ్ బోర్డుకు సంబంధించిన 23 నెలల బకాయిలను మొత్తం ఒకే దఫా ఈ నెల 21న చెల్లించనున్నారు. ఈమేరకు సింగరేణి యాజమాన్యం అంగీకరించిందని టీబీజీకేఎస్ శ్రీరాంపూర్ ఏరియా ఆర్గనైజింగ్ సెక్రటరీ రౌతు సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం టీబీజీకేఎస్ యూనియన్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, అధ్యక్షుడు వెంకట్రావు కోరిక మేరకు బకాయిలను మొత్తం ఒకే దఫా చెల్లించనున్నట్లు పేర్కొన్నారు.
బకాయిలను కార్మికులకు రెండు దఫాలుగా చెల్లిస్తామని గతంలో పేర్కొన్న నేపథ్యంలో, సింగరేణి యాజమాన్యంతో టీబీజీకేస్ గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, అధ్యక్షులు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజు రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లయ్య చర్చించినట్లు తెలిపారు.
వేతనం బకాయిలను ఒకేసారి చెల్లించాలని కోరడంతో సింగరేణి యాజమాన్యం అందుకు అంగీకరించిందన్నారు. కల్వకుంట కవితకు కార్మికుల తరపున ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.