సగం జీతమే ఇస్తాం.. పనిచేస్తారా! ఫ్రెషర్లకు విప్రో షాక్
విధాత: దేశీయ ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఒకటైన విప్రో.. ఫ్రెషర్లకు షాక్ ఇచ్చింది. ముందుగా ఆఫర్ చేసిన జీతంలో సగమే ఇస్తామని అంటున్నది. దీంతో విప్రో నుంచి ఈ తరహా పరిస్థితిని అస్సలు ఊహించని ఫ్రెషర్లంతా ఒక్కసారిగా అవాక్కవుతున్నారిప్పుడు. తమ వద్ద విజయవంతంగా శిక్షణను పూర్తి చేసుకున్న ఫ్రెషర్లకు ఏటా రూ.6.5 లక్షల వేతనం ఇస్తామని విప్రో ప్రకటించింది. అయితే ఇప్పుడు రూ.3.5 లక్షలకే పనిచేయాలని అంటున్నది. ఈ మేరకు సంస్థలో కొత్తగా చేరిన వారందరికీ ఓ […]

విధాత: దేశీయ ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఒకటైన విప్రో.. ఫ్రెషర్లకు షాక్ ఇచ్చింది. ముందుగా ఆఫర్ చేసిన జీతంలో సగమే ఇస్తామని అంటున్నది. దీంతో విప్రో నుంచి ఈ తరహా పరిస్థితిని అస్సలు ఊహించని ఫ్రెషర్లంతా ఒక్కసారిగా అవాక్కవుతున్నారిప్పుడు.
తమ వద్ద విజయవంతంగా శిక్షణను పూర్తి చేసుకున్న ఫ్రెషర్లకు ఏటా రూ.6.5 లక్షల వేతనం ఇస్తామని విప్రో ప్రకటించింది. అయితే ఇప్పుడు రూ.3.5 లక్షలకే పనిచేయాలని అంటున్నది. ఈ మేరకు సంస్థలో కొత్తగా చేరిన వారందరికీ ఓ మెయిల్ కూడా విప్రో నుంచి వెళ్లడం గమనార్హం.
తక్కువ జీతానికి చేరాలనుకునే ఉద్యోగులకు నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం కూడా విప్రో ఇచ్చింది. ఆయా దేశాల ఆర్థిక పరిస్థితులు, వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకొనే నియామకాలను చేపడుతామంటున్న విప్రో.. ప్రస్తుతం రూ.3.5 లక్షల కంటే ఎక్కువ జీతం కొత్తవారికిచ్చే పరిస్థితుల్లో తాము లేమంటున్నది.