Google Archive | గూగుల్‌ ఆల్బమ్‌ ఆర్కైవ్‌ ఈ నెల 19 నుంచి షట్‌డౌన్‌..! డేటాను ఇలా స్టోర్‌ చేసుకోండి..!

Google Archive | టెక్‌ దిగ్గజం గూగుల్‌ గూగుల్ ఆల్బమ్ ఆర్కైవ్ (Google Album Archive) సేవలను నిలిపివేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నెల 19 నుంచి గూగుల్‌ ఆర్కైవ్‌ అందుబాటులో ఉండదని వెల్లడించింది. ఈ టూల్‌లో యూజర్లకు ఎంతో ప్రయోజనం ఉంది. పర్సన్‌ మీడియా డేటాను సేవ్‌ చేసుకోవడం పాటు మేనేజ్‌ చేసుకునేందుకు ఆల్బమ్‌ ఆర్కైవ్‌ ఎంతో ఉపయోగకరంగా ఉండేది. దీన్ని తొలగించాలని నిర్ణయం తీసుకున్నది. యూజర్లకు సైతం ఎయిల్‌ ద్వారా సమాచారం అందించింది. […]

Google Archive | గూగుల్‌ ఆల్బమ్‌ ఆర్కైవ్‌ ఈ నెల 19 నుంచి షట్‌డౌన్‌..! డేటాను ఇలా స్టోర్‌ చేసుకోండి..!

Google Archive | టెక్‌ దిగ్గజం గూగుల్‌ గూగుల్ ఆల్బమ్ ఆర్కైవ్ (Google Album Archive) సేవలను నిలిపివేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నెల 19 నుంచి గూగుల్‌ ఆర్కైవ్‌ అందుబాటులో ఉండదని వెల్లడించింది. ఈ టూల్‌లో యూజర్లకు ఎంతో ప్రయోజనం ఉంది. పర్సన్‌ మీడియా డేటాను సేవ్‌ చేసుకోవడం పాటు మేనేజ్‌ చేసుకునేందుకు ఆల్బమ్‌ ఆర్కైవ్‌ ఎంతో ఉపయోగకరంగా ఉండేది. దీన్ని తొలగించాలని నిర్ణయం తీసుకున్నది. యూజర్లకు సైతం ఎయిల్‌ ద్వారా సమాచారం అందించింది.

అయితే, మూసివేతకు గల కారణాలు మాత్రం తెలియలేదు. అయితే, యూజర్లు ప్రస్తుతం అందులో ఉన్న డేటాను సేవ్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. యూజర్లు తమ గూగుల్ ఆల్బమ్ ఆర్కైవ్ డేటాను లింక్‌ని ఉపయోగించి సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని గూగుల్‌ తెలిపింది.

డౌన్‌లోడ్ చేసిన తర్వాత మీకు ఈమెయిల్ ద్వారా లింక్‌ వస్తుంది. గూగుల్ డిస్క్, ఐక్లౌడ్, వన్ డ్రైవ్ లేదా డ్రాప్‌బాక్స్ వంటి మరో క్లౌడ్ స్టోరేజ్‌ సేవకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు వీలున్నది. ఈమెయిల్‌లో వచ్చిన గూగుల్ టేకౌట్ డౌన్‌లోడ్ లింక్ ఏడు రోజులు మాత్రమే చెల్లుబాటులో ఉంటుంది.

డేటాను ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి..

గూగుల్‌ ఆర్కైవ్‌ లాగిన్‌ కావాలి. AlbumArchive పక్కన ఉన్న చెక్‌బాక్స్‌లో క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత బ్లూ కలర్‌లోని ‘Next Step’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఆ తర్వాత మీరు మీ ఫైల్‌లు ఎక్కడ సేవ్ చేసుకోవాలని అనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి.

ఈమెయిల్ ద్వారా జిప్, టీజీజెడ్ ఫైల్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడంతో పాటు డ్రాప్‌బాక్స్, గూగుల్ డ్రైవ్, మైక్రోసాఫ్ట్ వన్‌డ్రైవ్ తదితర మరో స్టోరెజ్ సర్వీస్‌కు నేరుగా మీ అప్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఎదో ఒక ఆప్షన్‌ను ఎంచుకున్న తర్వాత డౌన్‌లోడ్ చేయడానికి బ్లూ కలర్‌లోని ‘Create an export’ బటన్‌పై క్లిక్ చేయాలి.

గూగుల్ మీ డేటాను ఎక్స్‌పోర్ట్‌ చేస్తుంది. ప్రాసెస్ పూర్తి కావడానికి చాలా సమయం పడుతుందని మీకు ఓ మెసేజ్ వస్తుంది. అది పూర్తయిన తర్వాత మీకు ఈమెయిల్‌ వస్తుంది. ఆల్బమ్ ఆర్కైవ్‌లో కేవలం 5ఎంబీ ఫొటోలు మాత్రమే ఉంటే.. ప్రక్రియ పూర్తయిన 2 నిమిషాల్లోనే గూగుల్‌ నుంచి మీకు కన్ఫర్మేషన్ ఈమెయిల్ వస్తుంది. జి, ప్టీజీజడ్ ఫైల్‌ను నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి గూగుల్ టేకౌట్‌ను ఉపయోగించవచ్చు. మీరు ఎంచుకున్న స్టోరేజ్ సర్వీస్‌లో మీ ఫైల్స్‌ను మేనేజ్ చేసుకోవచ్చు.