జనార్ధన్‌రెడ్డి రాజీనామాపై ట్విస్టు

టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్ధన్‌రెడ్డి రాజీనామాను గవర్నర్‌ తమిళి సై ఆమోదించలేదని రాజ్‌భవన్‌ వర్గాాలు వెల్లడించాయి.

జనార్ధన్‌రెడ్డి రాజీనామాపై ట్విస్టు

విధాత : టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్ధన్‌రెడ్డి రాజీనామాను గవర్నర్‌ తమిళి సై ఆమోదించలేదని రాజ్‌భవన్‌ వర్గాాలు వెల్లడించాయి. నిన్న ఆయన చైర్మన్‌ పదవికి రాజీనామా చేసి గవర్నర్‌ను తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. జనార్ధన్‌రెడ్డి రాజీనామాను గవర్నర్‌ ఆమోదించి సీఎస్‌కు పంపినట్లుగా తొలుత వార్తలు వెలువడ్డాయి.


అయితే జనార్ధన్‌రెడ్డి రాజీనామాను గవర్నర్‌ ఆమోదించలేదని రాజ్‌భవన్‌ స్పష్టం చేసింది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీకి బాధ్యులు ఎవరో తెలిసేవరకు రాజీనామాను ఆమోదించకూడదని గవర్నర్‌ ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. పేపర్ లీకేజీలకు బాధ్యుడు అంటూ డీవోపీటీకి గవర్నర్‌ గతంలో లేఖ రాసినట్టు సమాచారం.