మంత్రి స‌బితకు గ‌వ‌ర్న‌ర్ అపాయింట్‌మెంట్ ఖ‌రారు

విధాత: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి రాజ్‌భ‌వ‌న్ అపాయింట్‌మెంట్ ఖ‌రారైంది. సాయంత్రం 5 గంట‌ల‌కు గ‌వ‌ర్న‌ర్ తమిళిసైతో మంత్రి స‌బితా ఇంద్రారెడ్డితో పాటు ఉన్న‌త విద్యాశాఖ అధికారులు కూడా స‌మావేశం కానున్నారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలోని యూనివ‌ర్సిటీల కామ‌న్ రిక్రూట్‌మెంట్ బోర్డుపై గ‌వ‌ర్న‌ర్‌కు ఉన్న సందేహాల‌ను మంత్రి, అధికారులు నివృత్తి చేసే అవ‌కాశం ఉంది. కామ‌న్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లును గ‌వ‌ర్న‌ర్ పెండింగ్‌లో పెట్టిన విష‌యం విదిత‌మే. తనకు గవర్నర్ అపాయింట్‎మెంట్ ఇంకా లభించలేదని మంత్రి […]

  • By: krs    latest    Nov 10, 2022 10:42 AM IST
మంత్రి స‌బితకు గ‌వ‌ర్న‌ర్ అపాయింట్‌మెంట్ ఖ‌రారు

విధాత: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి రాజ్‌భ‌వ‌న్ అపాయింట్‌మెంట్ ఖ‌రారైంది. సాయంత్రం 5 గంట‌ల‌కు గ‌వ‌ర్న‌ర్ తమిళిసైతో మంత్రి స‌బితా ఇంద్రారెడ్డితో పాటు ఉన్న‌త విద్యాశాఖ అధికారులు కూడా స‌మావేశం కానున్నారు.

ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలోని యూనివ‌ర్సిటీల కామ‌న్ రిక్రూట్‌మెంట్ బోర్డుపై గ‌వ‌ర్న‌ర్‌కు ఉన్న సందేహాల‌ను మంత్రి, అధికారులు నివృత్తి చేసే అవ‌కాశం ఉంది. కామ‌న్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లును గ‌వ‌ర్న‌ర్ పెండింగ్‌లో పెట్టిన విష‌యం విదిత‌మే.

తనకు గవర్నర్ అపాయింట్‎మెంట్ ఇంకా లభించలేదని మంత్రి సబిత అనడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తీరుపై నిన్న ప్రెస్‎మీట్‎లో గవర్నర్ తీవ్ర ఆరోపణలు చేసిన విష‌యం తెలిసిందే. తమిళిసై కామెంట్స్‎తో తెలంగాణలో పొలిటికల్ కాక రేపాయి. ఈ నేపథ్యంలో తమిళిసైతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి భేటీకానుండటం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది