స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ఎప్పటి వరకు అంటే?
తెలంగాణలో స్కూళ్లకు రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించింది

- 12 నుంచి 17వ తేదీ వరకు 6 రోజులు..
విధాత, హైదరాబాద్: తెలంగాణలో స్కూళ్లకు రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించింది. విద్యాశాఖ అకడమిక్ ఇయర్ క్యాలెండర్ ప్రకారం ఈనెల 12 నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఉంటాయని తెలిపింది. మిషనరీ స్కూళ్లకు మినహాయింపు ఉంటుందని, మిగిలిన అన్ని స్కూళ్లకు ఈ సెలవులు వర్తిస్తాయని పేర్కొంది. కాగా ఈనెల 13న 2వ శనివారం కాగా.. 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ పండుగలు ఉన్నాయి. మొత్తం 6 రోజులు పాఠశాలలకు సంక్రాంతి సెలవులు రానున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో ఇవే చివరి దీర్ఘకాల సెలవులు కూడా కానున్నాయి.
ప్రైవేట్ విద్యా సంస్థలు సిలబస్ పేరిట పండుగ సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే చర్యలు తప్పవని విద్యాశాఖ హెచ్చరిస్తోంది. జనవరి నెల అంటేనే సెలవులు అంటూ విద్యార్థులు సంబరపడిపోతున్నారు. కొత్త ఏడాది ఆడంబరం మొదలవగానే సంక్రాంతి సెలవులూ వచ్చేశాయి. ఆ తర్వాత జనవరి 25న ఆదివారం, 26న రిపబ్లిక్ డే వరుస సెలవులు రాబోతున్నాయి. దీంతో అప్పుడే స్కూల్ పిల్లల్లో సంతోషం ప్రారంభమైంది.