MEDAK: అంబరాన్నంటిన క్రిస్మస్ సంబురాలు

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ చర్చిలో ప్రార్థనలు చేసిన లక్షలాది మంది భక్తులు ఏసుక్రీస్తు జననం శుభదినం.. దైవ సందేశం ఇచ్చిన బిషప్ రెవరెండ్ సాల్మన్ రాజ్ పాల్గొన్న మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పద్మా రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో కిటకిటలాడిన ఏసయ్య మందిరాలు సిద్దిపేటలో సంబురాల్లో పాల్గొని కేక్ కట్ చేసిన మంత్రి హరీశ్‌రావు మెదక్ ఉమ్మడి జిల్లా బ్యూరో: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్​ సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఉదయం […]

  • By: krs    latest    Dec 25, 2022 4:52 AM IST
MEDAK: అంబరాన్నంటిన క్రిస్మస్ సంబురాలు
  • ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ చర్చిలో ప్రార్థనలు చేసిన లక్షలాది మంది భక్తులు
  • ఏసుక్రీస్తు జననం శుభదినం.. దైవ సందేశం ఇచ్చిన బిషప్ రెవరెండ్ సాల్మన్ రాజ్
  • పాల్గొన్న మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పద్మా రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి
  • సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో కిటకిటలాడిన ఏసయ్య మందిరాలు
  • సిద్దిపేటలో సంబురాల్లో పాల్గొని కేక్ కట్ చేసిన మంత్రి హరీశ్‌రావు

మెదక్ ఉమ్మడి జిల్లా బ్యూరో: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్​ సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఉదయం నాలుగున్నర గంటలకు ప్రాతఃకాల ప్రార్థనతో ఘనంగా ప్రారంభయ్యాయి. ఉదయం నాలుగున్నర గంటలకే ప్రాతఃకాల ప్రార్థనతో శిలువ ఊరేగింపుగా తీసుకువచ్చి చర్చిలోని ప్రధాన వేదిక మీద ప్రతిష్టించాక క్రిస్మస్​ వేడుకలు ప్రారంభం అయ్యాయి.

చర్చికి హాజరైన లక్షలాది మంది భక్తులకు రైట్ రెవరెండ్ ఏసీ బిషప్ సాల్మన్​రాజు దైవ సందేశాన్ని అందించారు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నవారికి క్రిస్టమస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు… ఏసుక్రీస్తు జననం మానవాళింతటికి శుభదినం అన్నారు. నసించిన జనులకు ఆయన తెలియజేసిన గొప్ప శుభవార్త ప్రేమ కలిగిన మార్గం, క్షమాపణ కలిగిన మార్గం అనుసరించాలన్నారు.

మానవునికి దేవునికి మధ్య వచ్చిన ఎడబాటును తీసేసి మానవమాధ్యంలోకి జ్ఞానము తీసుకొచ్చి తానే దేవుడిగా సమాజ విస్తరణలో భాగస్వామిగా ప్రభువు ఉన్నాడని పేర్కొన్నారు. శాంతి, సమాధానం ,సంతోషం, విధేయత, నిరీక్షణ, సమృద్ధిగా, జీవించుటకు ఏసుక్రీస్తు మార్గాలు మనకెంతో అవసరమన్నారు. మానవాళి అంతయు ఏసుప్రభు చూపించిన మార్గంలో ముందుకు సాగాలని ఆయన కోరారు..

సిద్దిపేటలో

సిద్దిపేట జిల్లాలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చర్చిలో కేక్ కట్ చేసి క్రిస్మస్ సంబురాల్లో పాల్గొన్నారు. క్రిస్టియన్ మైనార్టీ సోదరులకు ఈ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న చర్చిలు భక్తులతో కిటకిటలాడాయి.

మెదక్ చర్చి వద్ద భారీ భద్రత

మెదక్ చర్చి వద్ద మెటల్ డిటెక్టర్లతో భారీ భద్రత ఎర్పాటు చేశారు.జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, డీఎస్పీ లు సైదులు,యాదగిరి రెడ్డి, సీఐలు మధు, విజయ్‌లతో పాటు పోలీస్ అధికారులు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.

యేసు ప్రభువు ఆశీస్సులు సీఎంకు ఉండాలి: మంత్రి సత్యవతి రాథోడ్

మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈసందర్భంగా చర్చిలో కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈఅనంతరం మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్రంలో ఉన్న అన్ని సర్వ మతాలను గౌరవిస్తూ రాష్ట్ర శ్రేయస్సును కోరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏసు ప్రభువు ఆశిశులు ఉండాలని రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలు ఉండలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మతాలకు ప్రాధాన్యత ఇస్తూ న్నారు అందులో భాగంగా క్రైస్తవ సోదరులకు క్రిస్మస్‌ సందర్భంగా గిఫ్ట్ ప్యాకెట్లు ఇస్తూ గొప్పగా సన్మానించుకోవడం జరుగుతుందన్నారు.

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని రాష్ట్రంలో ప్రవేశపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో కూడా అభివృద్ధి చెందలనే ఉదేశ్యంతో బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందని దానిపై ఏసు ప్రభువు చల్లని చూపు నిండు మనసు ఉండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. కుటుంబ సభ్యులతో మెదక్ చర్చిని సందర్శించడం చాలా సంతోషంగా ఉందన్నారు.

ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ క్రైస్తవులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఇంత గొప్ప మహా దేవాలయం మన మెదక్‌లో ఉండటం అదృష్టమని, పేదవారి కోసం కట్టిన ఈ మహాదేవలయం ఆసియా ఖండంలోని రెండో పెద్ద చర్చిగా ప్రసిద్ధి చెందడం గొప్ప వరమని అన్నారు.

ఏసుప్రభువు చూపిన మార్గాలను అనుసరిస్తు ముందుకు వేళ్ళని కోరారు. అలాగే మంత్రి సత్యవతి రథోడ్ , ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డిలను చర్చ్ నిర్వాహకులు గురువులు దీవెనలు అందించి శాలువలతో సన్మానించారు.. అంతకు ముందు చర్చి ప్రాంగణంలో కేక్‌ కట్ చేశారు.