బుద్ధవనంలో మహా స్తూపం అద్భుతం: ఢిల్లీ డిప్యూటీ స్పీకర్ రాఖీ బిర్లా
విధాత, నల్గొండ: అంతర్జాతీయ ప్రమాణాలతో బుద్ధవనంలో నిర్మించిన మహా స్తూపం మహా అద్భుతమని ఢిల్లీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రాఖీ బిర్లా అన్నారు. శనివారం నాగార్జున సాగర్‌లోని బుద్ధ వనం ప్రాజెక్టును డిప్యూటీ స్పీకర్ రేఖ బిర్లా దీపక్ కుమార్ జీ దంపతులు సందర్శించారు. ఈ సందర్భంగా బుద్ధవనం నిర్వహణ పర్యవేక్షకులు నరసింహారావు పుష్పగుచ్ఛాలతో వారికి స్వాగతం పలికారు. అనంతరం వారు బుద్ధుని పాదాలకు పుష్పాంజలి ఘటించారు. బుద్ధ వనంలోని బుద్ధ చరిత వనాన్ని సందర్శించి మహా […]

విధాత, నల్గొండ: అంతర్జాతీయ ప్రమాణాలతో బుద్ధవనంలో నిర్మించిన మహా స్తూపం మహా అద్భుతమని ఢిల్లీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రాఖీ బిర్లా అన్నారు. శనివారం నాగార్జున సాగర్‌లోని బుద్ధ వనం ప్రాజెక్టును డిప్యూటీ స్పీకర్ రేఖ బిర్లా దీపక్ కుమార్ జీ దంపతులు సందర్శించారు.

ఈ సందర్భంగా బుద్ధవనం నిర్వహణ పర్యవేక్షకులు నరసింహారావు పుష్పగుచ్ఛాలతో వారికి స్వాగతం పలికారు. అనంతరం వారు బుద్ధుని పాదాలకు పుష్పాంజలి ఘటించారు. బుద్ధ వనంలోని బుద్ధ చరిత వనాన్ని సందర్శించి మహా స్తూపంలోని ధ్యాన మందిరంలో ధ్యానం చేశారు.

ఈ సందర్భంగా రేఖా బిర్లా మాట్లాడుతూ బుద్ధవనం సందర్శన ప్రశాంతతను ఇచ్చిందని ,గౌతమ బుద్ధుని జీవిత దశలు అన్నింటినీ ఒకే చోట వీక్షించి గొప్ప అనుభూతికి లోనయ్యామన్నారు. పిదప నాగార్జునకొండ మ్యూజియాన్ని ,నాగార్జునసాగర్ ప్రధాన డ్యామ్‌ను సందర్శించారు. వారికి స్థానిక టూరిజం గైడు సత్యనారాయణ బుద్ధవనం విశేషాలను వివరించారు.
