విరాట్- సూర్య విధ్వంసకర బ్యాటింగ్‌.. సిరీస్ భార‌త్‌ కైవ‌సం

విధాత: విరాట్ కోహ్లీ విజృంభ‌న‌.. సూర్య‌కుమార్ యాద‌వ్ విధ్వంస‌క‌ర బ్యాటింగ్‌తో భార‌త్ మూడో టీ-20 మ్యాచ్‌లో ఘ‌న విజ‌యం సాధించి సిరీస్‌ను కైవ‌సం చేసుకున్న‌ది. మొద‌ట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 7 వికెట్ల న‌ష్టానికి 186 ప‌రుగులు చేసింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 187 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌తో బ‌రిలోకి దిగిన భార‌త్ మొద‌టి ఓవ‌ర్‌లోనే వికెట్ కోల్పోయింది. డానియ‌ల్ సామ్స్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ (1) షాట్‌కు ప్ర‌య‌త్నించి కీప‌ర్ వెడ్ చేతికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. […]

  • By: krs    latest    Sep 25, 2022 5:06 PM IST
విరాట్- సూర్య విధ్వంసకర బ్యాటింగ్‌.. సిరీస్ భార‌త్‌ కైవ‌సం

విధాత: విరాట్ కోహ్లీ విజృంభ‌న‌.. సూర్య‌కుమార్ యాద‌వ్ విధ్వంస‌క‌ర బ్యాటింగ్‌తో భార‌త్ మూడో టీ-20 మ్యాచ్‌లో ఘ‌న విజ‌యం సాధించి సిరీస్‌ను కైవ‌సం చేసుకున్న‌ది. మొద‌ట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 7 వికెట్ల న‌ష్టానికి 186 ప‌రుగులు చేసింది.

ఆస్ట్రేలియా నిర్దేశించిన 187 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌తో బ‌రిలోకి దిగిన భార‌త్ మొద‌టి ఓవ‌ర్‌లోనే వికెట్ కోల్పోయింది. డానియ‌ల్ సామ్స్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ (1) షాట్‌కు ప్ర‌య‌త్నించి కీప‌ర్ వెడ్ చేతికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంత‌రం కోహ్లీ బ్యాటింగ్‌కు వ‌చ్చాడు.

రోహిత్‌-కోహ్లీలు మెల్లగా ప‌రుగులు తీస్తూ స్కోర్ బోర్డు పెంచే ప్ర‌య‌త్నం చేశారు. ప్యాట్ క‌మిన్స్ వేసిన మూడో ఓవ‌ర్‌లో టెంప్ట్ అయి కెప్టెన్ రోహిత్ షాట్‌కు య‌త్నించి బౌండ‌రీ లైన్ వ‌ద్ద డానియ‌ల్ సామ్స్ చేతికి చిక్కాడు. సూర్య‌కుమార్ యాద‌వ్ బ్యాటింగ్‌కు వ‌చ్చిన త‌ర్వాత మ్యాచ్ స్వ‌రూపం మారిపోయింది.

అప్ప‌టిదాకా ఫ్లోర్లు, సిక్స‌ర్ల‌తో విరుచుకు ప‌డిన కోహ్లీకి సూర్య త‌న‌వంతు స‌హ‌కారాన్ని అందించ‌డ‌మే కాదు దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. విరాట్ త‌ర్వాత వ‌చ్చినా 29 బంతుల్లోనే 3 సిక్స‌ర్లు, నాలుగు ఫోర్ల‌తో హాఫ్ సెంచ‌రీ చేసిన సూర్య అభిమానులను అల‌రించారు. సూర్య‌కుమార్ 69 ప‌రుగులు చేసి భారీ షాట్‌కు ప్ర‌య‌త్నించి పెవీలియ‌న్‌కు చేరాడు.

మూడో వికెట్‌కు విరాట్‌తో క‌లిసి సూర్య 103 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నిర్మించాడు. మ‌రోవైపు 37 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్స్‌ల‌తో విరాట్ కోహ్లీ త‌న కెరీర్‌లో 33వ‌ అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన హార్దిక్ పాండ్య త‌న‌దైన శైలిలో బౌండ‌రీలు, సిక్స్‌ల‌తో భార‌త్ విజ‌యానికి అవ‌స‌ర‌మైన ప‌రుగులు చేశాడు.

మ్యాచ్ ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా మారింది. చివ‌రి ఓవ‌ర్‌లో భార‌త విజ‌యానికి 11 ప‌రుగులు కావాలి. చివ‌రి ఓవ‌ర్‌లో మొద‌టి బంతినే కోహ్లీ సిక్స‌ర్‌గా మ‌లిచాడు. 5 బంతుల్లో 5 ప‌రుగులు కావాల్సి ఉండ‌గా 63 ప‌రుగుల వ‌ద్ద కోహ్లీ ఔట్ అయ్యాడు. రెండు బంతుల్లో 4 ప‌రుగులు చేయాల్సి ఉండ‌గా హార్దిక్ పాండ్య ఫోర్ బాది భార‌త్‌కు అద్భుత విజ‌యాన్ని అందించాడు.