Breaking: గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల
విధాత: నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ వినిపించింది. నిరుద్యోగుల నాలుగేళ్ల నిరీక్షణకు తెరపడింది. గత వారం రోజులుగా ఇవాళ, రేపో గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలవుతుందని టీఎస్‌పీఎస్సీ ఊరించింది. ఎట్టకేలకు గురువారం సాయంత్రం గ్రూప్-2 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది టీఎస్‌పీఎస్సీ. గ్రూప్స్‌లో విభాగంలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష పూర్తయ్యింది. దీంతో గ్రూప్ 2 పరీక్ష ఎప్పుడా అని ఎదురుచూస్తున్న అభ్యర్థులకు టీఎస్‌పీఎస్పీ గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్-2 కింద 783 పోస్టుల భర్తీకి సర్వీస్ కమిషన్ నోటిపికేషన్ విడుదల […]

విధాత: నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ వినిపించింది. నిరుద్యోగుల నాలుగేళ్ల నిరీక్షణకు తెరపడింది. గత వారం రోజులుగా ఇవాళ, రేపో గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలవుతుందని టీఎస్‌పీఎస్సీ ఊరించింది. ఎట్టకేలకు గురువారం సాయంత్రం గ్రూప్-2 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది టీఎస్‌పీఎస్సీ.
గ్రూప్స్‌లో విభాగంలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష పూర్తయ్యింది. దీంతో గ్రూప్ 2 పరీక్ష ఎప్పుడా అని ఎదురుచూస్తున్న అభ్యర్థులకు టీఎస్‌పీఎస్పీ గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్-2 కింద 783 పోస్టుల భర్తీకి సర్వీస్ కమిషన్ నోటిపికేషన్ విడుదల చేసింది.
గ్రూప్-2 పరిధిలో ప్రస్తుతం 16 రకాల సర్వీస్ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ కేటగిరీలోకి మరో ఆరు కేటగిరీలను చేర్చడంతో పోస్టుల సంఖ్య పెరిగింది. జనవరి 18 నుంచి అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు.