గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. రెండు దశల్లో పోలింగ్

Gujarat Assembly Elections | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. యావత్ దేశం మొత్తం ఈ ఎన్నికల వైపే చూస్తోంది. అయితే రెండు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. డిసెంబర్ 1వ తేదీన మొదటి దశ, 5వ తేదీన రెండో దశ పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 8వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను విడుదల చేయనున్నారు. మొత్తం 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీకి.. మొదటి దశలో 89 […]

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. రెండు దశల్లో పోలింగ్

Gujarat Assembly Elections | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. యావత్ దేశం మొత్తం ఈ ఎన్నికల వైపే చూస్తోంది. అయితే రెండు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. డిసెంబర్ 1వ తేదీన మొదటి దశ, 5వ తేదీన రెండో దశ పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 8వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను విడుదల చేయనున్నారు. మొత్తం 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీకి.. మొదటి దశలో 89 స్థానాలకు, రెండో విడతలో 93 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రస్తుత అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరి 18తో ముగియనుంది.

2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 90 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్ 77 స్థానాలకే పరిమితమైంది. 2017 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుపొంది, తమ బలాన్ని 111కు పెంచుకుంది. ఈ సారి కూడా అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇక పంజాబ్ లో గెలుపొంది అధికారాన్ని కైవసం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ.. గుజరాత్ లో కూడా పోటీ చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఆప్ ప్రచారం ప్రారంభించింది. కాంగ్రెస్ కూడా బరిలో ఉన్నప్పటికీ, ప్రధాన పోటీ బీజేపీ, ఆప్ పార్టీల మధ్యనే నెలకొని ఉంది.