Gujarat | భార్య‌ను.. న‌గ్నంగా ఊరేగించిన మాజీ భ‌ర్త‌..

Gujarat | ఓ భ‌ర్త దారుణానికి పాల్ప‌డ్డాడు. ప‌ట్ట‌ప‌గ‌లు అంద‌రూ చూస్తుండ‌గానే భార్య‌ను వివ‌స్త్ర చేసి ఊరేగించాడు భ‌ర్త‌. ఈ ఘ‌ట‌న గుజ‌రాత్‌లోని ద‌హోద్ జిల్లాలో మే 28వ తేదీన చోటు చేసుకోగా, ఆల‌స్యంగా వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. మేష‌న జిల్లాలోని చ‌న‌స్మా గ్రామానికి చెందిన ఓ గిరిజ‌న మ‌హిళ‌కు కొన్నేండ్ల క్రితం వివాహ‌మైంది. అయితే ఏడాదిన్న‌ర క్రితం త‌న భ‌ర్త‌, న‌లుగురు పిల్ల‌ల‌ను వ‌దిలేసి, ఇంటి నుంచి వెళ్లిపోయింది. మ‌రో వ్య‌క్తితో ఆమె క‌లిసి […]

Gujarat | భార్య‌ను.. న‌గ్నంగా ఊరేగించిన మాజీ భ‌ర్త‌..

Gujarat | ఓ భ‌ర్త దారుణానికి పాల్ప‌డ్డాడు. ప‌ట్ట‌ప‌గ‌లు అంద‌రూ చూస్తుండ‌గానే భార్య‌ను వివ‌స్త్ర చేసి ఊరేగించాడు భ‌ర్త‌. ఈ ఘ‌ట‌న గుజ‌రాత్‌లోని ద‌హోద్ జిల్లాలో మే 28వ తేదీన చోటు చేసుకోగా, ఆల‌స్యంగా వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. మేష‌న జిల్లాలోని చ‌న‌స్మా గ్రామానికి చెందిన ఓ గిరిజ‌న మ‌హిళ‌కు కొన్నేండ్ల క్రితం వివాహ‌మైంది. అయితే ఏడాదిన్న‌ర క్రితం త‌న భ‌ర్త‌, న‌లుగురు పిల్ల‌ల‌ను వ‌దిలేసి, ఇంటి నుంచి వెళ్లిపోయింది. మ‌రో వ్య‌క్తితో ఆమె క‌లిసి జీవిస్తోంది. దీంతో భార్య‌పై మొద‌టి భ‌ర్త క‌క్ష పెంచుకున్నాడు.

అయితే రెండో భ‌ర్త గ్రామం రాంపుర‌లో త‌మ బంధువుల వివాహం ఉండ‌టంతో.. అత‌ని త‌ల్లి వారిని ఆహ్వానించింది. ఈ క్ర‌మంలో రెండో భ‌ర్త‌తో క‌లిసి ఆమె రాంపుర‌కు చేరుకుంది. మ‌హిళ మొద‌టి భర్త‌ను కూడా రెండో భ‌ర్త త‌ల్లి ఆహ్వానించింది. దీంతో ఆ పెళ్లి వేడుక‌కు ముగ్గురు వ‌చ్చారు.

ఇక త‌న భార్య‌ను మొద‌టి భ‌ర్త కారులో కిడ్నాప్ చేసి, మార్గాలా గ్రామానికి తీసుకొచ్చాడు. అక్క‌డ ప‌ట్ట‌ప‌గ‌లే, అంద‌రూ చూస్తుండ‌గానే ఆమె బ‌ట్ట‌లు విప్పేశాడు. దారుణంగా హింసించాడు. అంత‌టితో ఆగ‌కుండా న‌గ్నంగా ఆమెను ఊరేగించాడు.

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అయ్యాయి. ఆ వీడియోల ఆధారంగా పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. నిందితుడితో పాటు అత‌నికి స‌హ‌క‌రించిన మ‌రో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.