USA: అమెరికాలో కాల్పులు.. రంగారెడ్డి జిల్లా విద్యార్థి మృతి

  • By: sr    latest    Mar 05, 2025 3:03 PM IST
USA: అమెరికాలో కాల్పులు.. రంగారెడ్డి జిల్లా విద్యార్థి మృతి

విధాత, వెబ్ డెస్క్: అమెరికా(America)లో కాల్పుల ఘటన(Shooting Incident) కలకలం రేపింది. దుండగులు జరిపిన కాల్పుల్లో రంగారెడ్డి జిల్లా(Rangareddy District)కు చెందిన విద్యార్థి గంప ప్రవీణ్‌(Student Gampa Praveen)మృతి(Passed Away)చెందాడు. అమెరికాలో ఎంఎస్ రెండో సంవత్సరం చదువుతూ పార్ట్ టైం జాబ్ చేస్తున్న ప్రవీణ్ పై దుండగులు గన్‌తో కాల్పులు జరపడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు.

రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రానికి చెందిన గంప రాఘవులు-రమాదేవి దంపతులకు కొడుకు ప్రవీణ్(27)‌, కుమార్తె ఉన్నారు. కుమారుడు ప్రవీణ్‌ కొంతకాలం కిందట ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. అక్కడ విస్కాన్సిన్‌ మిల్వాంకిలో నివాసం ఉంటున్నాడు. అక్కడే యూనివర్సిటీలో ఎంఎస్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఖర్చుల కోసం ఓ స్టార్‌ హోటల్‌లో పార్ట్‌టైం జాబ్‌ చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే ప్రవీణ్‌ నివాసం ఉండే ఇంటికి సమీపంలోని బీచ్‌ దగ్గర తాజాగా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో గాయపడ్డ ప్రవీణ్‌ అక్కడికక్కడే మరణించారు. ప్రవీణ్‌ మరణవార్తను అతని స్నేహితులు ఇండియాలోని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రవీణ్‌ మృతితో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది.