Hanumakonda | వేం పురుషోత్తం రెడ్డి కుటుంబ సభ్యులకు రేవంత్ రెడ్డి పరామర్శ

Hanumakonda మంత్రి ఎర్ర‌బెల్లి, ఎమ్మెల్యే పెద్ది పరామర్శ విధాత‌, హనుమకొండ: కాంగ్రెస్ పార్టీ పిసిసి మెంబర్ వేం నరేందర్ రెడ్డి సోదరుడు వేం పురుషోత్తం రెడ్డి నిన్న యాక్సిడెంట్ లో మరణించగా ఆదివారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి హనుమకొండకు వచ్చి వేం నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రేవంత్ రెడ్డి వెంట మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, జిల్లా కాంగ్రెస్ అధ్య‌క్షుడు నాయిని రాజేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. […]

Hanumakonda | వేం పురుషోత్తం రెడ్డి కుటుంబ సభ్యులకు రేవంత్ రెడ్డి పరామర్శ

Hanumakonda

  • మంత్రి ఎర్ర‌బెల్లి, ఎమ్మెల్యే పెద్ది పరామర్శ

విధాత‌, హనుమకొండ: కాంగ్రెస్ పార్టీ పిసిసి మెంబర్ వేం నరేందర్ రెడ్డి సోదరుడు వేం పురుషోత్తం రెడ్డి నిన్న యాక్సిడెంట్ లో మరణించగా ఆదివారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి హనుమకొండకు వచ్చి వేం నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

రేవంత్ రెడ్డి వెంట మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, జిల్లా కాంగ్రెస్ అధ్య‌క్షుడు నాయిని రాజేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తో కలిసి వేం పురుషోత్తం రెడ్డి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి మనోధైర్యాన్ని అందించారు.

పురుషోత్తం రెడ్డి మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన వారిలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తదితరులు ఉన్నారు.