వేధిస్తున్నాడని.. యువకుని చేతులు కట్టేసి కత్తితో పొడిచి హత్య.. పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన యువతి
ములుగు జిల్లా ఏటూరునాగారంలో ఘటన విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: భార్య వదిలేసిన ఓ యువకుని వేదింపులు భరించలేక ఆ వ్యక్తిని యువతి హత్య చేసిన సంఘటన ములుగు జిల్లాలోని ఏటూరునాగారం మండలం కేంద్రంలో గురువారం తెల్లవారుజామున జరిగింది. అనంతరం ఆ యువతి పోలీసుల ఎదుట లొంగిపోయింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జాడి సంగీత అనే యువతిని పెళ్లి చేసుకొమ్మని అదే కాలనీకి చెందిన రామటెంకి శ్రీనివాస్(25) గత కొన్ని రోజులుగా వేధిస్తున్నాడు. శ్రీనివాస్ […]

ములుగు జిల్లా ఏటూరునాగారంలో ఘటన
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: భార్య వదిలేసిన ఓ యువకుని వేదింపులు భరించలేక ఆ వ్యక్తిని యువతి హత్య చేసిన సంఘటన ములుగు జిల్లాలోని ఏటూరునాగారం మండలం కేంద్రంలో గురువారం తెల్లవారుజామున జరిగింది. అనంతరం ఆ యువతి పోలీసుల ఎదుట లొంగిపోయింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
జాడి సంగీత అనే యువతిని పెళ్లి చేసుకొమ్మని అదే కాలనీకి చెందిన రామటెంకి శ్రీనివాస్(25) గత కొన్ని రోజులుగా వేధిస్తున్నాడు. శ్రీనివాస్ కు ఇదివరికే పెళ్లి అయ్యి భార్య వదిలి వేసింది. ఈ క్రమంలో సంగీతను పలు విధాలుగా వేధిoపులకు గురి చేస్తున్నాడు.
ఇదే విషయమై గతంలో అతనిపై కేసు పెట్టగా జైలుకు కూడా వెళ్ళి వచ్చాడు. అయినప్పటికీ బుధవారం రాత్రి సైతం గొడవ జరిగింది. తెల్లవారుజామున శ్రీనివాస్ తన పద్దతి మార్చుకోకుండా వేధిపులకు గురి చేస్తున్నాడని విసుగు చెందిన యువతి శ్రీనివాస్ చేతులు కట్టేసి కత్తితో పొడిచి చంపింది. అనంతరం ఆ యువతి పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయింది. హత్యకు గల కారణాలు మరిన్ని తెలియాల్సి ఉంది.