‘గాడ్‌ఫాదర్’ విడుదల తర్వాత చిరు-సల్మాన్‌ల స్పందన ఎంటంటే?
విధాత: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘గాడ్‌ఫాదర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రాంప్ ఆడేస్తుంది. విడుదలైన అన్ని చోట్లా పాజిటివ్ టాక్‌తో, సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. సినిమా విడుదల తర్వాత వచ్చిన టాక్‌తో చిరంజీవే కాదు.. సినిమా యూనిట్ మొత్తం ఊపిరి పీల్చుకుంది. ‘ఆచార్య’ సినిమా తర్వాత ఈ సినిమా విజయం సాధించడం చిరంజీవికి ఎంతో కీలకం. అందుకే ఈ సినిమా కోసం చిరంజీవి ఎంతో ఎఫర్ట్ పెట్టాడు. ముఖ్యంగా చిరుకి హిట్టివ్వాలని రామ్ చరణ్ కూడా […]

విధాత: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘గాడ్‌ఫాదర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రాంప్ ఆడేస్తుంది. విడుదలైన అన్ని చోట్లా పాజిటివ్ టాక్‌తో, సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. సినిమా విడుదల తర్వాత వచ్చిన టాక్‌తో చిరంజీవే కాదు.. సినిమా యూనిట్ మొత్తం ఊపిరి పీల్చుకుంది. ‘ఆచార్య’ సినిమా తర్వాత ఈ సినిమా విజయం సాధించడం చిరంజీవికి ఎంతో కీలకం.

అందుకే ఈ సినిమా కోసం చిరంజీవి ఎంతో ఎఫర్ట్ పెట్టాడు. ముఖ్యంగా చిరుకి హిట్టివ్వాలని రామ్ చరణ్ కూడా రంగంలోకి దిగి.. ఏది కావాలంటే అది ప్రొవైడ్ చేశాడు. ఈ విషయం స్వయంగా చిరంజీవే ఓ స్టేజ్‌పై చెప్పారు. ఈ సినిమాని తన దగ్గరకు తీసుకువచ్చింది, భారీ బడ్జెట్‌తో తెరకెక్కించింది.. అలాగే ఓ పాత్రకి సల్మాన్ ఖాన్‌ని రప్పించింది.. అంతా చరణే అంటూ చిరు చెప్పుకొచ్చారు. ఇప్పుడు విడుదల తర్వాత సినిమా రిజల్ట్‌తో అంతా సంతోషంగా ఉన్నారు.
ఈ సినిమా సక్సెస్‌ను పురస్కరించుకుని.. సినిమాలో కీలకపాత్రలో నటించిన సల్మాన్ ఖాన్.. చిరంజీవికి శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియోని విడుదల చేశారు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ‘‘మై డియర్ చిరు గారు.. ఐ లవ్ యూ. ‘గాడ్ ఫాదర్’ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుందని తెలిసింది. కంగ్రాచ్యులేషన్స్. గాడ్ బ్లెస్ యూ.. వందే మాతరం’’ అంటూ.. మెగాస్టార్‌కు సల్మాన్ శుభాకాంక్షలు తెలిపాడు. దీనికి చిరంజీవి కూడా బదులిస్తూ.. ఓ వీడియోను విడుదల చేశారు.

ఇందులో.. ‘‘థ్యాంక్యూ మై డియర్ సల్లూ భాయ్.. మరియు నీకు కూడా కంగ్రాచ్యులేషన్స్. ఎందుకంటే.. నువ్వు చేసిన మసూమ్ భాయ్ పాత్ర.. ఈ సినిమా అత్యద్భుతమైన విజయానికి బలంగా నిలిచింది. థ్యాంక్యూ.. లవ్ యు.. లవ్ యూ సో మచ్’’ అంటూ సల్మాన్ ఖాన్‌కు చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. వీరిద్దరూ ఇలా వీడియోల ద్వారా చేసిన హడావుడి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. చిరంజీవికి హిట్టొస్తే.. అది అందరి విజయం.. అంటూ ఫ్యాన్స్ కూడా హడావుడి చేస్తున్నారు.