మత సామరస్యానికి ప్రతీక అర్వపల్లి ‘హాజ్రత్ ఖాజా నసిరుద్దీన్ బాబా దర్గా’

గంధం ఊరేగింపులో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే కిషోర్ కుమార్ విధాత: మత సామరస్యానికి ప్రతీక హజ్రత్‌ ఖాజా నసీరుద్దీన్ బాబా ఉర్సు అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా జాజిరెడ్డి గూడెం మండలం అర్వపల్లి లోని మసీద్‌లో సాంప్రదాయ పద్దతిలో ప్రార్థన నిర్వహించిన అనంతరం గంధం ఉరేగింపును మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ దర్గాకు వందల ఏళ్ల […]

  • By: krs    latest    Dec 24, 2022 3:24 AM IST
మత సామరస్యానికి ప్రతీక అర్వపల్లి ‘హాజ్రత్ ఖాజా నసిరుద్దీన్ బాబా దర్గా’

గంధం ఊరేగింపులో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే కిషోర్ కుమార్

విధాత: మత సామరస్యానికి ప్రతీక హజ్రత్‌ ఖాజా నసీరుద్దీన్ బాబా ఉర్సు అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా జాజిరెడ్డి గూడెం మండలం అర్వపల్లి లోని మసీద్‌లో సాంప్రదాయ పద్దతిలో ప్రార్థన నిర్వహించిన అనంతరం గంధం ఉరేగింపును మంత్రి లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ దర్గాకు వందల ఏళ్ల చరిత్ర ఉందని, సూర్యాపేట జిల్లా ప్రజలే కాకుండా రాష్ట్రంలోని పలు జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు దర్గాని దర్శించుకుంటారన్నారు. హిందువులు, ముస్లిలు ఐక్యమత్యంతో జరుపుకునే ఉర్సు ఉత్సవమని, ఇదే సాంప్రదాయాన్ని భవిష్యత్‌లో కొనసాగించాలన్నారు.

అనంతరం దర్గా పురవీధుల గుండా గంధం ఊరేగింపు సాగింది. స్థానిక ఎమ్మెల్యే కిషోర్ తో పాటు మంత్రి గంధం పెట్టెలను స్వయంగా మోసుకుంటూ ఊరేగింపు గా దర్గా వద్దకు తీసుకువెళ్ళారు. ముతవల్లులు ధర్మ కార్యక్రమాలను నిర్వహించారు. గంధం ఊరేగింపులో మార్ఫా వాయిద్య కళాకారుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి