రెండేండ్లుగా సహజీవనం.. భార్యను 50 ముక్కలుగా నరికేశాడు..
విధాత: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య ఘటన మరువక ముందే అలాంటి ఘటనే మరొకటి వెలుగు చూసింది. శ్రద్ధా వాకర్‌ను అఫ్తాబ్ 35 ముక్కలుగా నరికి చంపిన విషయం తెలిసిందే. ఆ మాదిరిగానే ఓ వ్యక్తి తన భార్యను 50 ముక్కలుగా నరికి చంపేశాడు. ఈ అత్యంత దారుణ ఘటన జార్ఖండ్‌లోని సాహెబ్‌గంజ్ జిల్లాలోని బొరియో పీఎస్ పరిధిలో వెలుగు చూసింది. సాహెబ్‌గంజ్ జిల్లాకు చెందిన దిల్దార్ అన్సారీకి రెండేండ్ల క్రితం గిరిజన […]

విధాత: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య ఘటన మరువక ముందే అలాంటి ఘటనే మరొకటి వెలుగు చూసింది. శ్రద్ధా వాకర్‌ను అఫ్తాబ్ 35 ముక్కలుగా నరికి చంపిన విషయం తెలిసిందే. ఆ మాదిరిగానే ఓ వ్యక్తి తన భార్యను 50 ముక్కలుగా నరికి చంపేశాడు. ఈ అత్యంత దారుణ ఘటన జార్ఖండ్‌లోని సాహెబ్‌గంజ్ జిల్లాలోని బొరియో పీఎస్ పరిధిలో వెలుగు చూసింది.
సాహెబ్‌గంజ్ జిల్లాకు చెందిన దిల్దార్ అన్సారీకి రెండేండ్ల క్రితం గిరిజన జాతికి చెందిన రుబికా పహదీన్(22) పరిచయమైంది. వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం సహజీవనానికి దారి తీసింది. గత రెండేండ్ల నుంచి ఇద్దరూ కలిసి ఉంటున్నారు. ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. అయితే రుబికాను అన్సారీ అతి కిరాతకంగా నరికి చంపాడు. అనంతరం ఆమె శరీరాన్ని 50 ముక్కలుగా నరికేశాడు. ఆ తర్వాత శరీర భాగాలను పలు ప్రదేశాల్లో విసిరేశాడు.
అయితే నిర్మాణంలో ఉన్న ఓ అంగన్‌వాడీ కేంద్రం వద్ద మహిళకు చెందిన శరీర భాగాలను కుక్కలు పీక్కుతింటున్నాయి. దీంతో స్థానికులు అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన సాహెబ్‌గంజ్ ఎస్పీ.. తమ బృందంతో మృతురాలి శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే అదృశ్యం కేసు నమోదవగా, ఆ మహిళ, దొరికిన డెడ్ బాడీ భాగాలు ఒకటేనా? కాదా? అన్న కోణంలో ఎస్పీ దర్యాప్తు చేపట్టారు. జాగిలాలతో కూడా పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
అనుమానంతో పోలీసులు దిల్దార్ అన్సారీని అదుపులోకి తీసుకుని విచారించారు. ఎందుకంటే తన భార్య అదృశ్యమైందని అప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. రుబికాను తానే చంపినట్లు అన్సారీ అంగీకరించాడు. దీంతో మిగతా శరీర భాగాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. రుబికా హత్య కేసులో అన్సారీ కుటుంబ సభ్యుల పాత్ర ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
లభించిన శరీర భాగాలు ఇవే..
రుబికాకు సంబంధించిన చేతి వేళ్లు, భుజాలు, లోయర్ బ్యాక్, ఊపిరితిత్తులు, కడుపు, మోచేతి వంటి భాగాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు 12 శరీర భాగాలు లభ్యమయ్యాయని పోలీసులు పేర్కొన్నారు. మిగతా వాటి కోసం గాలిస్తున్నామని తెలిపారు.