Vijay Devarakonda | ఈడీ విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ
Vijay Devarakonda | టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) విచారణకు హాజరయ్యాడు. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన లైగర్ చిత్రం లావాదేవీల విషయంలో విజయ్‌ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. గతంలో పూరీ జగన్నాథ్‌తో పాటు సహ నిర్మాణ చార్మీ కౌర్‌ను ఈడీ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. తాజాగా విజయ్‌ను విచారించి పలు విషయాలను అధికారులు రాబడుతున్నారు. లైగర్ మూవీకి సంబంధించి దుబాయికి డబ్బులు పంపించి, తిరిగి అక్కడి నుంచి ఈ సినిమాలో పెట్టుబడులు […]

Vijay Devarakonda | టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) విచారణకు హాజరయ్యాడు. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన లైగర్ చిత్రం లావాదేవీల విషయంలో విజయ్‌ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. గతంలో పూరీ జగన్నాథ్‌తో పాటు సహ నిర్మాణ చార్మీ కౌర్‌ను ఈడీ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. తాజాగా విజయ్‌ను విచారించి పలు విషయాలను అధికారులు రాబడుతున్నారు.
లైగర్ మూవీకి సంబంధించి దుబాయికి డబ్బులు పంపించి, తిరిగి అక్కడి నుంచి ఈ సినిమాలో పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ అధికారులు గతంలో ప్రాథమికంగా గుర్తించారు. ఈ వ్యవహారంలో ఓ రాజకీయ నాయకుడి ప్రమేయం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో లైగర్ నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని అధికారులు విచారిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ ఏడాది ఆగస్టు 25న లైగర్ మూవీ విడుదలైన విషయం విదితమే. కానీ బాక్సాఫీస్ వద్ద బొక్కబొర్లా పడింది.