అటు తండ్రి.. ఇటు కొడుకుతో రోమాన్స్ చేసిన హీరోయిన్స్ వీరే!
విధాత: ఒక హీరో సరసన రెండు మూడు తరాల హీరోయిన్లతో కలిసి నటించిన సందర్భాలు అయితే ఉన్నాయి. తనకు మనవరాలిగా నటించిన శ్రీదేవితో సీనియర్ ఎన్టీఆర్ చిందులేసిన సంగతి విదితమే. ఇప్పటికీ ఆరు పదులు దాటిన చిరంజీవి, బాలయ్యల సరసన అందులో సగం వయసు కూడా లేని శృతిహాసన్ జోడీ కట్టడం చూస్తూనే ఉన్నాం. అయితే తండ్రి కొడుకులు అయిన రెండు తరాల వారితో కలిసి నటించిన హీరోయిన్లు చాలా తక్కువ అని చెప్పాలి. వారి వివరాల […]

విధాత: ఒక హీరో సరసన రెండు మూడు తరాల హీరోయిన్లతో కలిసి నటించిన సందర్భాలు అయితే ఉన్నాయి. తనకు మనవరాలిగా నటించిన శ్రీదేవితో సీనియర్ ఎన్టీఆర్ చిందులేసిన సంగతి విదితమే. ఇప్పటికీ ఆరు పదులు దాటిన చిరంజీవి, బాలయ్యల సరసన అందులో సగం వయసు కూడా లేని శృతిహాసన్ జోడీ కట్టడం చూస్తూనే ఉన్నాం.
అయితే తండ్రి కొడుకులు అయిన రెండు తరాల వారితో కలిసి నటించిన హీరోయిన్లు చాలా తక్కువ అని చెప్పాలి. వారి వివరాల విషయానికి వెళ్తే శృతిహాసన్ తాజాగా వాల్తేరు వీరయ్యలో మెగాస్టార్ చిరంజీవి సరసన నటించింది. ఇంతకుముందు ఈమె రామ్ చరణ్ సరసన ఎవడు చిత్రంలో యాక్ట్ చేసింది. ఇంకా మరో హీరోయిన్ కాజల్ అగర్వాల్ రామ్ చరణ్ తో మగధీర, నాయక్ గోవిందుడు అందరివాడేలే సినిమాల్లో జోడిగా నటించింది. ఆ తరువాత చిరంజీవికి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150లో చిరు సరసన ఆడి పాడింది.
తమన్నా విషయానికి వస్తే రామ్ చరణ్ సరసన రచ్చ సినిమాలో నటించిన ఈమె చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డిలో యాక్ట్ చేసింది. త్వరలో విడుదల కానున్న బోలా శంకర్ లో మరోసారి చిరుకు జోడిగా నటిస్తోంది. హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ విషయానికొస్తే నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్యతో రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో నటించింది. ఆ తరువాత నాగార్జున సరసన మన్మధుడు 2లో యాక్ట్ చేసింది.
ఇక లావణ్య త్రిపాఠి కూడా నాగచైతన్యతో యుద్ధం శరణంలో జోడిగా నటించింది. నాగార్జునతో సోగ్గాడే చిన్నినాయన సినిమాలో కథానాయకగా చేసింది. ఇంకా ఎన్టీఆర్ బాలకృష్ణల విషయానికి వస్తే బాలీవుడ్ హీరోయిన్ రతి అగ్నిహోత్రి ఎన్టీఆర్ తో కలియుగ రాముడు, ప్రేమ సింహాసనం వంటి సినిమాలలో కథానాయకగా నటించింది.
తర్వాత బాలకృష్ణతో శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర సినిమాలో నటించింది. జయసుధ కూడా ఎన్టీఆర్ తో పలు చిత్రాల్లో నటించింది. చాలాకాలం తర్వాత ఆమె అధినాయకుడు సినిమాలో బాలయ్య సరసన నటించడం విశేషం. నాటి అందాల తార రాధ కూడా రామారావుతో కలిసి చండశాసనుడు సినిమాలో హీరోయిన్గా నటించింది. బాలకృష్ణతో పలు సినిమాలలో రొమాన్స్ పండించింది.
ఇక ఏఎన్ఆర్ నాగార్జున విషయానికి వస్తే రాధా అక్కినేని నాగేశ్వరరావు తో ఆదర్శవంతుడు, వసంతగీతం, గోపాలకృష్ణుడు వంటి సినిమాల్లో నటించింది. ఆ తర్వాత అక్కినేని కుమారుడైన నాగార్జునతో విక్కీ దాదా సినిమాలో నటించి మెప్పించింది. రాధా అటు తెలుగులోనే కాదు తమిళంలో కూడా తండ్రి కొడుకులతో నటించిన ఘనత సాధించింది.
తమిళంలో శివాజీ గణేషన్ సరసన ఆమె ఆత్మబంధువులో నటించిన ఈమె తర్వాత ప్రభుతో కూడా ఒకటి రెండు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. అతిలోక సుందరి శ్రీదేవి విషయానికి వస్తే ఏఎన్ఆర్ సరసన ప్రేమాభిషేకం, శ్రీరంగనీతులు, ముద్దుల కొడుకు వంటి చాలా సినిమాల్లో నటించి మెప్పించింది.
నాగార్జున సరసన ఆఖరిపోరాటం, గోవిందా గోవిందా, ఖుదా గవా, మిస్టర్ బేచారా వంటి సినిమాలలో నటించి మెప్పించింది. బాలీవుడ్ లో కూడా తండ్రి కొడుకులైనా ధర్మేంద్ర, సన్నిడియోల్ లతో నటించిన ఘనత శ్రీదేవికి దక్కుతుంది. అమితాబ్ తో కలిసి లాల్ బాద్షా సినిమాలో నటించిన శిల్పా శెట్టి ఆ తరువాత అభిషేక్ బచ్చన్ సరసన ఫిర్ మిలేంగే చిత్రంలో నటించింది.
ఐశ్వర్యారాయ్ బంటి అవుర్ బబ్లీ చిత్రంలో తండ్రి తనయులైన అమితాబచ్చన్, అభిషేక్ బచ్చన్ తో కలిసి కజ్ రారే పాటలో ఆడి పాడింది. కానీ ఈమె తన మామ అమితాబ్ సరసన మాత్రం నటించలేదు. కృష్ణా రమేష్ బాబుల విషయానికొస్తే కృష్ణతో గూడచారి 117 వంటి చిత్రంలో నటించిన భానుప్రియ ఆయన కొడుకు అయినా రమేష్ బాబుతో కలిసి బ్లాక్ టైగర్ సినిమాలో హీరోయిన్గా నటించిగా, గౌతమి కూడా కృష్ణ నటించిన అన్న తమ్ముడు డియర్ బ్రదర్ సినిమాల్లో యాక్ట్ చేసింది.
అంతకుముందే ఈమె రమేష్ బాబు సరసన కృష్ణ గారి అబ్బాయి సినిమాల్లో కనిపించింది. రంభ విషయానికి వస్తే సూపర్ స్టార్ తో రౌడీ అన్నయ్య సినిమా చేసింది అంతకు ముందు ఎస్ నేనంటే నేనే సినిమాలో నటించి మెప్పించింది. ఆ తర్వాత రమేష్ బాబు హీరోగా నటించిన పచ్చతోరణంలో ఆయనకు జోడిగా నటించింది.
ఆమని కూడా కృష్ణ సరసన పచ్చని సంసారం సినిమాలో హీరోయిన్గా మెప్పించింది. ఆ తర్వాత రమేష్ బాబు నటించిన అన్నా చెల్లెలు సినిమాలో హీరోయిన్గా నటించింది. వాణి విశ్వనాథ్ రమేష్ బాబు సరసన ఆయుధం, మామ కోడలు సినిమాల్లో యాక్ట్ చేసింది. కృష్ణా సరసన రైతు భారతంలో నటించింది.
ఎన్కౌంటర్ చిత్రంలో రమేష్ బాబు సరసన రుచిత ప్రసాద్ కథానాయకగా నటించిన ఆ తర్వాత కొన్ని ఏళ్లకు ఈమె సూపర్ స్టార్ కృష్ణ నటించిన వారెవ్వా మొగుడు చిత్రంలో నటించిన ఘనత సాధించింది. మొత్తానికి పలువురు హీరోయిన్లు కూడా రెండు తరాల హీరోలైన తండ్రి కొడుకుల సరసన నటించి అరుదైన రికార్డును సృష్టించారనే చెప్పాలి.