మేడిగడ్డ విచారణ నాలుగు వారాలకు వాయిదా

మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై సుప్రీం లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరుతూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది

  • By: Somu    latest    Mar 04, 2024 12:05 PM IST
మేడిగడ్డ విచారణ నాలుగు వారాలకు వాయిదా
  • సీడబ్ల్యుసీని ఇంప్లిడ్ చేయాలని హైకోర్టు సూచన


విధాత: మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై సుప్రీం లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరుతూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది. సోమవారం పిటిషన్ విచారణ చేసిన హైకోర్టు ప్రభుత్వం ఈ కేసులో సీడబ్ల్యుసీని ఇంప్లిడ్ చేయాలని ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణకు ఆదేశించామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. మరోవైపు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించేందుకు ఈ నెల 6న ఎన్డీఎస్‌ఎఫ్ కమిటీ రాష్ట్రానికి రానుంది. ఆ కమిటీ నాలుగు నెలల్లో నివేదిక ఇవ్వనుంది.


మరోవైపు వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ల జారీలో అవకతవకలకు పాల్పడిన ఇంజనీర్లపై వేటు వేసేందుకు ప్రనుత్వం సిద్ధమవుతుంది. ఈఈ, ఎస్‌ఈలకు ముందు నోటీస్‌లు జారీ వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. వారిచ్చిన తప్పుడు సర్టిఫికెట్ల ఆసరగా బ్యారేజీ పునరుద్దరణ ఖర్చులను భరించేందుకు ఇప్పుడు ఎల్‌ఆండ్‌టీ నిరాకరిస్తుంది. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కమిటీ ఇంజనీర్లపైన, ఎల్‌ఆండ్‌టీ సంస్థపైన మూడు కేసులు నమోదు చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది.